బ్రేకింగ్ న్యూస్ : అడియాశలైన శశికళ ఆశలు..దోషిగా నిర్ధారించిన సుప్రీం..!

Tuesday, February 14th, 2017, 01:34:01 PM IST


తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని ఆశించిన శశికళ ఆశలు గల్లంతయ్యాయి. జయలలిత అక్రమాస్తుల కేసులో ఏ 2 ముద్దాయిగా ఉన్న శశికళని సుప్రీం కోర్టు దోషిగా నిర్ధారించింది.దీనితో శశికళ వర్గం పూర్తిగా నిరాశలోకి వెళ్లింది.గత వారం రోజులుగా తమిళనాడు ముఖ్యమంత్రి పదవి కోసం ఆమె పన్నీర్ సెల్వంకు వ్యతిరేకంగా రాజకీయ వ్యూహాలు రచిస్తున్న విషయం తెలిసిందే. ఇక శశికళ వర్గం లో ఉన్న 119 మంది ఎమ్మెల్యే లు పన్నీర్ కు మద్దత్తు తెలిపుతారో లేదో చూడాలి.

కాగా జయలలిత అక్రమాస్తుల కేసులో ఉన్న అందరు నిందితులను సుప్రీం కోర్టు దోషులుగా ప్రకటించింది. జయలలిత, శశికళ, ఇళవరసి, సుధాకరన్ లకు సుప్రీం నాలుగేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. వెంటనే లొంగిపోవాలని ఆదేశాలు కూడా జారీ చేయడం విశేషం.