ఓటేయండి… ఫ్రీగా భోజనం చేయండి!

Wednesday, July 25th, 2018, 09:53:58 PM IST


ఆహా వింటుంటేనే ఈ స్కీం ఎంత బాగుందో అనిపిస్తుంది కదూ. అయితే ఈ స్కీం మన దేశంలో లేదండి వేరేదేశంలో అమలవుతోంది. ఇక విషయంలోకి వెళితే, ప్రస్తుతం పాకిస్తాన్ దేశంలో సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలకు ఓటు హక్కు విలువ చెపుతూ, అందరూ ఓటు వేసేలా చైతన్యం కలిగించేందుకు అక్కడి రెస్టారెంట్లు ఇటువంటి స్కీం ని ప్రవేశపెట్టాయి. పాకిస్థాన్ లోని ప్రధాన నగరాల్లోని దాదాపు 20కి పైగా లగ్జరీ రెస్టారెంట్లు ప్రజలను ఓటేయండి, ఓటేసిన గుర్తును చూపించి తమ హోటళ్లలో కావాల్సినంత ఉచితంగా భోజనం చేయండని ఆఫర్ ప్రకటించాయి. దీనికోసం ఆ హోటళ్లు పత్రికలు, మీడియా, మరియు అన్ని రకాల సామజిక మాధ్యమాల సహాయాన్ని తీసుకున్నాయి.

అయితే ఓటేసి వచ్చిన వారికీ మాములుగా తమ హోటళ్లలో పెట్టే రోజువారీ వంటకాలు కాకుండా కొన్ని ప్రత్యేక వంటకాలను సైతం సిద్ధం చేయిస్తున్నారు. అంతే కాదు చిన్న పిల్లలను వెంటపెట్టుకువచ్చిన తల్లులకు ప్రత్యేకమైన వంటకాలను వండి వడ్డిస్తున్నారు. మరికొన్ని హోటళ్లయితే ఎవరెవరికి ఏమికావాలో హోటల్ సిబ్బందితో దగ్గరుండి వడ్డించుకుని తినవచ్చని ప్రకటించారు. మరికొన్నేమో మీకడుపు నిండినంత తిని, కావాలంటే మీ ఇంటికి కూడా పార్సెల్ పట్టుకెళ్లండి అయితే వాటికి కేవలం 50% మాత్రమే ధర చెల్లించండి అంటూ ఆఫర్లు గుప్పించాయి. ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఓటుహక్కుతో మంచి నాయకున్ని ఎన్నుకోవడం ద్వారా ప్రజల భవిష్యత్తు, దేశ భవిష్యత్తు బాగుంటుందని,

తద్వారా ఎక్కువమందికి లాభం చేకూరుతుందని ఇటువంటి ప్రకటనలు తాము చేపట్టినట్లు అయన రెస్టారెంట్ల నిర్వాహకులు చెపుతున్నారు. అయితే ఇటీవల జరిగిన దేశంలోని, కర్ణాటక ఎన్నికల్లో కూడా ఒక రెస్టారెంట్ వారు, ఓటేయండి తరువాత వచ్చి మా హోటల్ లో దోశె తిని కూల్ డ్రింక్ తాగండి అంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇటువంటి ఆఫర్లు మన దేశ హోటళ్లు, రెస్టారెంట్లు కూడా ప్రకటిస్తే బాగుండు అని మన వాళ్ళు ఇప్పటినుండే సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments