జస్ట్ 50 లక్షలు.. చంద్రబాబుకు చమటలు !

Wednesday, October 3rd, 2018, 08:37:55 AM IST

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిండెంట్ రేవంత్ రెడ్డిపై జరుగిన ఐటీ దాడులు, వాటి తదుపరి విచారణల లక్ష్యం ఓటుకు నోటు కేసేనని స్పష్టమైపోయింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికే ఓటు వేయాలంటూ నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రేవంత్ రెడ్డి రూ.50 లక్షల అడ్వాన్స్ ఇవ్వడం, ఈ విషయమై చంద్రబాబు సైతం స్టీఫెన్‌సన్‌ తో ఫోన్లో మాట్లాడిన సంభాషణలు నిజమేనని నమ్ముతున్న ఐటీ, ఈడీ శాఖలు అసలు ఆ 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలిస్తే కేసు ఒక కొలిక్కి వచ్చినట్టేనని భావిస్తున్నాయి.

అందుకే మొన్నటి సోదాల్లో రేవంత్ తో పాటు ఉదయసింహ, కొండల్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, పద్మనాభరెడ్డి ఇళ్లలో కూడ సోదాలు నిర్వహించి కొన్ని ఆధారాలు సేకరించింది. ఇక రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లోని ఆయకార్ భవన్ లో విచారణకు హాజరుకానుండగా అధికారులు ఆ 50 లక్షల మీదనే ఆయన్ను ఎక్కువగా ప్రశించనున్నారని, ఎలాగైనా 50 లక్షల మూలాల్ని తెలుసుకోవాలనే దృఢ సంకల్పంతో ఉన్నారని సమాచారం.

ఒకవేళ విచారణలో ఆ 50 లక్షలతో సంబంధం ఉందని తేలితే చంద్రబాబు ఇబ్బందుల్లో పడ్డట్టే. కేసులో ఉన్న ఐదుగురితో కలిపి ఆయనపై కూడ ఈడీ అధికారులు గురిపెడతారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని టీడీపీ నేతలు కంగారుపడుతున్నారు.