ప్రీమియర్ షో టాక్ : ఉన్నది ఒక్కటే జిందగీ !

Friday, October 27th, 2017, 05:41:07 AM IST


దర్శకుడు కిషోర్ తిరుమల, హీరో రామ్ ల హిట్ కాంబినేషన్ వస్తున్న చిత్రం ‘ఉన్నది ఒక్కటే జిందగీ’. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘నేను శైలజ’ చిత్రం మంచి విజయం సాధించనిన సంగతి తెలిసిందే. కాగా ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. హీరో రామ్ సరికొత్త లుక్.. అనుపమ, లావణ్య త్రిపాఠిలు యువతని ఆకర్షించే అంశాలు. అంతటా ఏర్పడిన పాజిటివ్ బజ్ తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందు రానుంది. కాగా ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్ షో లు పూర్తయ్యాయి.

దర్శకుడు ఫ్రెండ్ షిప్ ని ప్రేమ కథని బ్యాలెన్స్ చేస్తూ సినిమాని నడిపించాడు. ఫస్ట్ హాఫ్ డీసెంట్ గానే సాగింది. కానీ సెకండ్ హాఫ్ కి వచ్చే సరికి కథ నెమ్మదించింది. రామ్, అనుపమ ల పెర్ఫామెన్స్ కి మంచి మార్కులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని దేవిశ్రీ అందించిన సంగీతం, ఎమోషనల్ సన్నివేశాలు ప్రాణం పోశాయనే చెప్పాలి. ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ లలో వచ్చే ట్విస్ట్ లు ఆసక్తికరంగా ఉంటాయి. ఫ్రెండ్ షిప్, ప్రేమ కథని కిషోర్ తిరుమల ఎమోషనల్ గా చూపించే మంచి ప్రయత్నం చేశారు. ఓవరాల్ సినిమా డీసెంట్ గా ఉంది. మరో భారీ చిత్రం పోటీలో లేదు కాబట్టి కమర్షియల్ గా ఎంతటి సక్సెస్ అవుతుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments