వహ్వా విరాట్ : ‘దటీజ్ కోహ్లీ’ అంటూ అభినందనల వెల్లువ!

Friday, August 3rd, 2018, 02:28:57 PM IST

ఎన్నాళ్ళనుండో ఎదురుచూస్తున్న స్వప్నం ఇప్పుడు నిజమైనట్లుగా, గతంలో ఇంగ్లాండ్ గడ్డపై పర్యటన సందర్భంగా ప్రదర్శించిన పేలవమైన ఆటతీరును అప్పట్లో పలు విమర్శలు ఎదుర్కొన్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు టెయిలెండర్ల సాయంతో ఒంటారి పోరాటం చేసి నిన్నటి మ్యాచ్ లో దిగ్విజయంగా సెంచరీ సాధించడంతో ఒక్కసారిగా అభిమానులు మరియు ప్రముఖుల నుండి ఆయనకు ప్రశంశల జల్లు కురుస్తోంది. వహ్వా విరాట్ అదరగొట్టావ్ మళ్ళి నీ ప్రతిభను నిరూపించుకున్నావ్, దటీజ్ కోహ్లీ అంటూ అందరూసోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. ఎంతో కీలక సమయంలో నీ పోరాటం నిజంగా అభినందించదగ్గది, అద్భుత సెంచరీ సాధించిన నీకు నా శుభాభినందనాలు అంటూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పోస్ట్ చేసారు. 2014లో అతని 10 ఇన్నింగ్స్ లో చేసిన పరుగులు ఈ ఒక్క ఇన్నింగ్స్ లో చేసి అద్భుత ఘనత సాధించాడు. షమీ, ఇశాంత్, యాదవ్ లతో 99 పరుగులు చేరగా,

వారి పరుగులు కేవలం 8 కావడం, మిగతావి కోహ్లీవి కావడం నిజంగా ఒక అద్భుతమని భారత డాషింగ్ బ్యాట్స్ మాన్ వీరేందర్ సెహ్వాగ్ పోస్ట్ చేస్తూ తెలిపారు. ఎన్నాళ్ళనుండో ఎదురుచూస్తున్న నా కల నిజమైంది, కోహ్లీ గ్రౌండ్లో షాట్లు కొడుతూ ఆఖరికి సుచరి సాధించాక ఆయనను చూస్తే నాకు అమిత ఆనందం కలిగింది అంటూ ఒక అభిమాని ట్వీట్ చేసాడు. కోహ్లీ, నీది నిజంగా సెన్సేషనల్ బాటింగ్, ఈ సిరీస్ కు సరికొత్త ఆరంభాన్ని ఇచ్చావు మిత్రమా అంటూ సురేష్ రైనా పోస్ట్ చేసారు. వాట్ ఏ ప్లేయర్ ఒంటిచేత్తో మొత్తం మ్యాచ్ ని శాసించాడు, నీ కెరీర్ లోనే ఇది ఒక గొప్ప సెంచరీ, మరియు ఇన్నింగ్స్ మిత్రమా అంటూ మహమ్మద్ ఖైఫ్ ట్వీట్చేశారు . ఇలా చెప్పుకుంటూ పోతే కోహ్లీకి ఇంకా ఎందరెదరో అభిమానులు, ప్రముఖులు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ విధంగాస్ తన కెరీర్ లో 22వ సెంచరీ సాధించిన కోహ్లీ, టెయిలెండర్ల సాయంతో సాధించిన ఈ ఘనతను ఎప్పటికి మర్చిపోలేనని చెపుతున్నాడు…

  •  
  •  
  •  
  •  

Comments