చెత్తగా ఆడి గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నారు: సీనియర్ క్రికెటర్

Thursday, September 20th, 2018, 10:31:21 PM IST

దుబాయ్ అంటే పాకిస్తాన్ కు ఒక అడ్డా అని చెప్పవచ్చు. అక్కడ ఎలాంటి మ్యాచ్ లు జరిగినా కూడా పాకిస్తాన్ జట్టు చాలా ఈజీగా విజయాన్ని అందుకుంటుంది. పాత రికార్డులను చుస్తే ఆ విషయం ఈజీగా అర్ధమవుతుంది. ఇకపోతే రీసెంట్ గా భారత్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం పాక్ జట్టు కొంచెం కూడా ప్రభావం చూపకపోవడంతో పాక్ సీనియర్ క్రికెటర్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ ఎలాంటి ఒత్తిడి లేకుండా గెలుస్తుందని అనుకున్నాం. కానీ ఇంత చిత్తుగా ఓడిపోతుందని ఊహించలేదని సీనియర్ క్రికెటర్ వాకర్ యూనిస్ పేర్కొన్నారు.

పాక్ కంటే ముందు భారత్ చిన్న జట్టు హాంకాంగ్ తో చెమటోడ్చి గెలిచింది. దుబాయ్ లో విపరీతమైన వేడి వాతావరణం భారత ఆటగాళ్లకు అంతగా అనుకూలించదు. ఆ వాతావరణం ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉంటుంది. కానీ అలా జరగలేదు. పాకిస్తాన్ ఒత్తిడికి లోనవ్వడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక గోల్డెన్ ఛాన్స్ ను పాక్ మిస్ చేసుకుంది. అన్ని విషయాలు పాకిస్తాన్ కు అనుకూలిస్తాయి అనుకుంటే సీన్ రివర్స్ అయ్యిందని చివరగా 2011లో మొహాలీలో జరిగిన వరల్డ్‌కప్‌ సెమీ ఫైనల్‌ మ్యాచే భారత్ పాక్ మధ్య జరిగిన అత్యంత రసవత్తరమైన మ్యాచ్ అని వకార్‌ తెలిపాడు.