కాంగ్రెస్ లో ఆ నేతల మధ్య లొల్లి.. ఎవరు పట్టించుకోరేంటి?

Monday, July 30th, 2018, 09:55:21 AM IST

రాజకీయాల్లో అలకలనేది సర్వసాధారణమని అందరికి తెలిసిన విషయమే. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇటీవల కాలంలో నేతలు మధ్య నెలకొన్న విభేదాలు తార స్థాయికి చేరుతున్నాయి. అయితే అంతర్యుద్ధం చేస్తున్న వారికీ ఇది ఎంతవరకు లాభాన్ని ఇస్తుందో తెలియదు గాని పార్టీ ప్రతిష్టను మాత్రం గట్టి దెబ్బె కొడుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ పై అలాంటి ఆరోపణలే వస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య అర్ధం చేసుకునే గుణం లేదనే టాక్ వస్తోంది.

ఇటీవల కొన్ని ఘటనలు కూడా అందుకు ఉదాహరణగా నిలిచాయి. టీఆరెస్ లో గ్రూపు రాజకీయాల మధ్య వివాదాలు చెలరేగకుండా కేసీఆర్ టీమ్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. నేతలను కంట్రోల్ లో క్రమశిక్షణతో పెట్టుకోవడం టీఆరెస్ అధిష్టానానికే సాధ్యమవుతోంది. కాంగ్రెస్ లో మాత్రం అది కొంచెం కూడా కనిపించడం లేదు. పార్టీ అధినేతగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్ల మార్పు పెద్దగా రావడం లేదు. ఇకపోతే ఇప్పుడు సీనియర్ నేతలైన జైపాల్ రెడ్డి మహిళా నాయకురాలు మాజీ ఎంపీ అరుణ మధ్య వివాదాలు మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి.

రాజకీయల్లో ఇరు నేతల మధ్య కనిపించని పోరు కనిపిస్తోందని లోక్ సభ స్థానాల మధ్య కూడా ఇరువురిలో పోటీ నెలకొంది. ఒకరిని మించి మరొకరు ఎత్తుగడలను వేస్తూ ముందుకు వెళుతున్న తరుణంలో సీనియర్ నేతలెవరూ ఈ విషయం గురించి పట్టించుకోకపోవడం గమనార్హం. అలాగే మహబూబ్‌నగర్‌ లోక్‌సభ టికెట్‌తోపాటు ఇతర అసెంబ్లీ స్థానాల కోసం బీసీలకు కేటాయించాలని అరుణ వేస్తున్న ప్రణాళికలకు జైపాల్ రెడ్డి టీమ్ అధిష్టానం తమకే మద్దతు ఇస్తుందని ధైర్యంతో ఉన్నారు. ఈ విషయంలో ఇరు వర్గాల మధ్య పోటీ ఎక్కువైంది. ఇప్పటికే కాంగ్రెస్ పై వస్తున్న విమర్శలకు ఈ పరిణామం ఇంకెలాంటి మచ్చ తెస్తుందో అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments