రాముడు – రావణ యుద్ధం మళ్ళీ మొదలైంది! ఇప్పుడు జనం మధ్య!

Wednesday, September 27th, 2017, 09:00:12 AM IST


నిన్న మొన్నటి వరకు ఏపీలో కంచె ఐలయ్య వైశ్యుల మీద రాసిన పుస్తకం పెద్ద సంచలనంగా మారి కాస్తా కులాల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఆ తరువాత ఆ వివాదం కాస్తా హిందూ, క్రిస్టియన్ అనే మతం రంగు పులుముకొని ఐలయ్య హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా మాట్లాడాడని పరిపూర్ణా నంద స్వామీ, అఘోరా సంఘ వారు తీవ్రంగా స్పందించారు. కంచె ఐలయ్య ఎలాంటి పుస్తకాలు రాసుకున్న తమకు అభ్యంతర లేదని అలా కాకుండా హిందూమతానని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని వార్నింగ్ కూడా అందుకున్నారు. ఇంకా ఈ వివాదం సమసిపోకముందే మరో కొత్త వివాదం తెరమీదకి వచ్చింది. హిందువులు ఆరాధ్యంగా భావించే శ్రీరాముడుని మీద కర్నాటకకి చెందిన ఒక సాహితీ వేత్త దారుణమైన వాఖ్యలు చేసి ఈ హిందువుల మనోభావాలని కించపరిచే విధంగా వ్యవహరించాడు. ఇప్పుడు ఈ మాటలతో మరో కొత్త వివాదం అగ్గి రాజుకుంటుంది. ఇంకో వైపు ఉత్తరప్రదేశ్ కి చెందిన ఒక లాయర్ రావణ దహనం అనే పద్దతిని వెంటనే ఆపాలని కోరుతూ ప్రధాని, రాష్ట్రపతికి లేఖ రాసింది. ఇప్పుడు ఇది మరో వివాదంగా మరెలా కనిపిస్తుంది.

ఇక అసలు విషయం ఏంటంటే కంచె ఐలయ్య వివాదం ఇంకా సద్దుమణగక ముందే, కర్ణాటకకి చెందిన ప్రముఖ సాహితీ వేత్త భగవాన్ రాముడు మీద సంచలన వాఖ్యలు చేసారు. నిండు గర్భిని అని ఆలోచించకుండా సీతని అడవికి పంపించి మానవత్వం మంటగలిపిన శ్రీ రాముడు దేవుడు ఎలా అవుతాడు అంటూ మైసూరులో జరుగుతున్నా దసరా ఉత్సవాల్లో ఆయన ప్రశ్నించారు. మానవత్వం మంటగలిపిన అలాంటి వ్యక్తికి అయోధ్యలో ఆలయం నిర్మించాల్సిన అవసరం ఏమిటి. మానవత్వం లేని రాముడు దేవుడు ఎలా అవుతాడు. కట్టుకున్న భార్యని వదిలేసినా వాడు ఆదర్శ పురుషుడు ఎలా అవుతాడు అంటూ ప్రశ్నించి ఒక్కసారిగా వివాదాన్ని రాజేసాడు. ఇప్పుడు అతని వాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. గతంలో హిందువుల మనోభావాలని కించపరిచే విధంగా మాట్లాడారని కర్ణాటకకి చెందిన కల్బుర్గీ, గౌరీ లంకేష్ ని హత్య చేసారు అనే విషయం చాలా మంది నమ్ముతున్నారు. ఇప్పుడు మరో సారి ఈ సాహితీ వేత్త అలాంటి వాఖ్యలు చేసి ప్రజలని రెచ్చగొట్టే ప్రయత్నం చేసారు. మరి ఈ వివాదం ఎంత వరకు దారితీస్తుందో తెలియదు.

ఇంతలో మరో సంఘటన మీద యూపీలో ఓంవీర్ సారస్వత్ అనే లాయర్, రావణ దహనం నిషేధించాలని కోరుతూ రాష్ట్రపతికి, ప్రధానికి లేఖలు రాసారు. రావణుడు సారస్వత్ బ్రాహ్మణుడు, అతన్ని ఇలా దసరా ఉత్సవాల్లో దహనం చేయడం వారి మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే వారి దేవుడుని అవమానించినట్లు అవుతుంది. మనది లౌకిక ప్రజాస్వామ్య దేశం అని మీరు అంటే వెంటనే ఈ రావణ దహనం ఆ లాయర్ లేఖలో ప్రస్తావించారు. ఒకని మనోభావాలని కించపరిచే హక్కు ఎవరికీ లేదని ఆ లాయర్ తన వాదన వినిపించారు. అలాగే రావణ దహన కార్యక్రమంలో తొక్కిసలాట వలన ఎంతో మంది ప్రజలు చనిపోతున్నారని కూడా తన ఆవేదన చెప్పారు. ఇప్పుడు ఈ విషయం కూడా బయటకి రావడంతో ఒక్కసారిగా హిందు మతంపై జరుగుతున్న దాడికి ఆజ్యం పోసినట్లు అయ్యింది. అప్పుడెప్పుడో ముగిసిపోయిన రామ – రావణ యుద్ధం ఇప్పుడు ప్రజల మధ్య మళ్ళీ మొదలయ్యేలా ఉంది. ఇది ఎంత వరకు వెళ్తుంది అనేది ప్రస్తుతానికి అర్ధం కాని విషయం.

  •  
  •  
  •  
  •  

Comments