టీడీపీ – జనసేనల మధ్య మాటల యుద్ధం..!

Friday, November 9th, 2018, 03:08:06 PM IST

టీడీపీ, జనసేన పార్టీల మధ్య మాట మాట పెరిగి ఒక రకమైన యుద్ధ వాతావరణమే నెలకొంది ఇరు పార్టీల మధ్య, గత ఎన్నికల్లో ఒకటిగా ఉన్న ఈ రెండు పార్టీలు, ఇపుడు ఒక్కటంటే ఒకదానికి పడకుండా ఉన్నాయి. ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తె భగ్గుమనే పరిస్థితి ఉందిప్పుడు, నువ్వు నీతిమాలిన దానివంటే నువ్వు నీతిమాలిన దానివి అంటూ రెండు పార్టీలు మాటల దాడికి దిగుతున్నాయి. ఒకరి లోపాలు ఒకరు ఎత్తి చూపుకుంటూ నీతులు చెప్తున్నాయి రెండు పార్టీలు. ఇటీవల రాహుల్ తో చంద్రబాబు కలిసి కాంగ్రెస్, టీడీపీల పొత్తు ఖాయం అని తేల్చిన తర్వాత జనసేనాని పవన్ బాబు పై టీడీపీ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ నైతిక విలువలు లేని పార్టీ అని, బాబుకు రాజకీయ నైతిక విలువలు అనేవి ఏ మాత్రం లేవు అంటూ బాబు పై ధ్వజమెత్తారు.

తర్వాత దీనికి టీడీపీ వెంటనే కౌంటర్ ఇచ్చింది.గత ఎన్నికల్లో నువ్వు మాతో కలిసి ఉన్నావు, ఇపుడు సొంతంగా పోటీకి సిద్దమయ్యావ్, మాకు లేదంటున్న నైతికత నీకు ఉందా, మాకు అనైతికం అయింది నీకు ఎలా నైతికం అవుతుంది అంటూ ప్రశ్నించింది. తర్వాత రెండు పార్టీల మధ్య ఫ్లెక్సీల వార్ మొదలైంది. పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి పార్టీ పెట్టి కాంగ్రెస్ లో విలీనం చేసాడు, ఆ నాడు కాంగ్రెస్ పార్టీ అంటరాని పార్టీ కాదు, ఇపుడు అంటరాని కాంగ్రెస్ పార్టీనా అని ప్రశ్నించింది. ఆ తర్వాత పవన్ మరో అంశం పై టీడీపీ ని విమర్శించాడు. ఆ నాడు నోట్ల రద్దు విషయంలోటీడీపీ బీజేపీ కి మద్దతిచ్చింది అని, పైగా మోడీకి ఆ సలహా ఇచ్చింది నేనే అని బాబు గొప్ప చెప్పుకున్నాడు, ఇపుడు మాత్రం నోట్ల రద్దును తప్పు పడ్తున్నారు అంటూ బాబును ఎద్దేవా చేసారు పవన్. మరి దీనికి టీడీపీ ఎలా కౌంటర్ ఇస్తుందో చూడాలి.