వార్నర్ సిద్దమవుతున్నాడు.. ఫ్యాన్స్ హ్యాపీ!

Saturday, June 9th, 2018, 04:37:45 PM IST

బాల్ ట్యాపరింగ్ వివాదంతో జట్టు నుంచి ఏడాది వరకు నిషేధం ఎదుర్కొంటున్న వార్నర్ మళ్లీ తన పాత లైఫ్ లోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వార్నర్ ను అభిమానులు ఇప్పటికే చాలా మిస్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తుండడం వైరల్ అవుతోంది. బ్యాట్ తో కనిపించే వార్నర్ ఇతర పనులు చేసుకుంటూ ఉంటుంటే ఎంతో మంది బావిద్వేగానికి లోనయ్యారు. ఇక వార్నర్ కుటుంబంలో ఆరోగ్య సమస్యలు కూడా అందరిని కదిలించాయి.

అయితే వార్నర్ మళ్లీ అభిమానులను హ్యాపీ చేయడానికి బ్యాట్ పట్టబోతున్నాడు. ఈ నెల చివర్లో కెనడా టీ20 గ్లోబల్‌ లీగ్‌ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే అందులో వార్నర్‌ ఓ ఫ్రాంచైజీతో ఒప్పందం చేసుకున్నాడు. లీగ్ లో సత్తా చాటి మళ్లీ తన గత జీవితంలోకి రావాలని అనుకుంటున్నాడు. అందుకోసం వార్నర్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. రీసెంట్ గా ప్రాక్టిస్ చేసిన ఒక వీడియో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మళ్లీ వస్తాను అని అభిమానులకు సందేశాన్ని ఇచ్చాడు. తిరిగి గ్రౌండ్ లోకి రావడం హ్యాపీగా ఉంది. ఈ సెషన్‌ చాలా కష్టంగా గడిచింది ఇక ముందుగు సాగడమే నా టార్గెట్ అంటూ వార్నర్ పోస్ట్ చేశాడు. అభిమానులు కూడా వార్నర్ వస్తుండడంతో సంతోషంగా కామెంట్ చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments