గుర్తుపెట్టుకుని మరీ భజ్జీని గెలికిన వార్నర్ !

Sunday, February 26th, 2017, 05:30:56 PM IST


తొలిటెస్ట్ లో టీం ఇండియా చెత్త ప్రదర్శనకు ఆటగాళ్ల పరిస్థితి ఎలా ఉందో తెలియదు కానీ కొందరు సీనియర్ ఆటగాళ్లు, మాజీల పరిస్థితి దారుణంగా ఉంది. కోహ్లీసేన మీద నమ్మకంతో హర్భజన్ లాంటి ఆటగాళ్లు కొంచెం ఎక్కువే మాట్లాడారు. గంగూలీ, గవాస్కర్ లాంటి ఆగటగాళ్లు భారత్ లో ఆసీస్ కు ఇబ్బందులు తప్పవని అంటే, సీనియర్ ఆటగాడు హర్భజన్ మాత్రం ఇండియాకు చెత్త ఆసీస్ టీం వస్తోందని, వారు 4-0 తో ఓడిపోవడం ఖాయమని బజ్జీ అన్నాడు. ఆస్ట్రేలియా ఎంత బాగా ఆడినా ఇండియా కనీసం 3 -0 తో గెలుస్తుందన్న నమ్మ కాని వ్యక్తం చేసాడు.

కానీ టీం ఇండియా తొలి టెస్టులో ఆట చూసాక బజ్జీ నోటికి తాళం పడ్డట్లైంది.మిగతా ఆసీస్ ఆటగాళ్లు బజ్జీ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకున్నట్లు లేరుకాని, ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మాత్రం గుర్తుపెట్టుకున్నాడు.హర్భజన్ చేసిన వ్యాఖ్యలను వార్నర్ తొలి టెస్ట్ ముగిసాక రీట్వీట్ చేయడం విశేషం. ఓటమికి కారణం టీం ఇండియా ఆటగాళ్లలో అలసత్వమే కారణమని గవాస్కర్ అంటే, ఇలాంటి పిచ్ లు తయారు చేయించుకునే ముందు ఆలోచించుకోవాలని గంగూలీ సలహా ఇచ్చాడు. సచిన్ మాత్రం టీమ్ ఇండియా సిరీస్ ని కోల్పోలేదని తిరిగి పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసాడు.