ఇదంతా నావల్లే … వార్నర్ వైఫ్ కంటతడి

Sunday, April 1st, 2018, 04:15:45 PM IST

బాల్ టాంపరింగ్ ఉదంతంలో ప్రధాన పాత్ర ఆస్ట్రేలియా మాజీ వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌దే. అందుకే స్మిత్‌తోపాటు అతన్ని కూడా క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధించింది. ఇక తాను ఎప్పటికీ ఆస్ట్రేలియా టీమ్‌కు ఆడనేమో అని వార్నర్ మీడియా ముందు కూడా ఏడ్చిన విషయం తెలిసిందే. అయితే దీనంతటికీ తానే కారణమని అతని భార్య కాండిస్ వార్నర్ బాధ పడుతున్నది. సౌతాఫ్రికా వికెట్ కీపర్ డీకాక్ తన గురంచి తప్పుగా మాట్లాడటం, దానికి వార్నర్ దీటుగా ప్రతిస్పందించడం.. ఆ తర్వాత సౌతాఫ్రికా అభిమానులు తమను హేళన చేయడం.. ఇవన్నీ బాల్ టాంపరింగ్ ఉదంతానికి దారి తీశాయని ఆమె చెప్పింది. ఇదంతా మొదలైంది తన వల్లే అని చెబుతూ ఆమె ఏడ్చేసింది. ఇదంతా నా వల్లే జరిగిందని అనిపిస్తున్నది. అది నన్ను చంపుతున్నది అంటూ కాండిస్ వార్నర్ సిడ్నీ సండే టెలిగ్రాఫ్ పత్రికతో చెప్పింది.

రెండో టెస్ట్ సందర్భంగా డీకాక్.. వార్నర్‌తో డ్రెస్సింగ్ రూమ్‌లో గొడవ పడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా న్యూజిలాండ్ రగ్బీ ప్లేయర్ సోనీ బిల్ విలియమ్స్‌తో వార్నర్ భార్య కాండిస్‌కు శారీరక సంబంధం ఉన్న విషయాన్ని డీకాక్ బయటపెట్టాడు. అప్పటి నుంచీ సౌతాఫ్రికా అభిమానులు గ్రౌండ్‌లో సోనీ బిల్ మాస్క్‌లు ధరించిన వార్నర్ దంపతులను హేళన చేయడం ప్రారంభించారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో వార్నర్ ప్రవర్తనను తాను సమర్థించకపోయినా.. అతను తనను, తన పిల్లలను రక్షించుకోవడం కోసం అలా చేశాడని కాండిస్ అంటున్నది. ఆ ఘటన తర్వాత ప్రతి రోజూ నేను ఏడవడం చూసి వార్నర్ తట్టుకోలేకపోయాడు. అయినా నేను ఆ అవమానాలను అధిగమించి గ్రౌండ్‌కు వెళ్లేదాన్ని. అయినా అక్కడి అభిమానులు నన్ను చూసి నవ్వడం, హేళన చేయడం ఇవన్నీ చూసి భరించలేకపోయాను అని కాండిస్ చెప్పింది.

  •  
  •  
  •  
  •  

Comments