వైరల్ న్యూస్ : 200 కోట్లతో హార్థిక్ పటేల్ ని కొనేసిన రాహుల్.. సూట్ కేస్ అదే..?

Wednesday, October 25th, 2017, 04:58:57 PM IST

దేశవ్యాప్తంగా ఉన్నా మోడీ మానియాని నామరూపాల్లేకుండా చేయాలంటే ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ నుంచే మొదలు పెట్టాలి. ఇది కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తాజా పథకం. గుజరాత్ ఎన్నికలకు డేట్ ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. డిసెంబర్ 9 మరియు 14 తేదీల్లో రెండు దశల్లో గుజరాత్ ఎన్నికలు జరగనున్నాయి. అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బిజెపి విజయం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. కాగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్గా మారింది. బీజీపీకి ప్రధాన అడ్డంకిగా ఉన్న ఉద్యమ కారుడు హార్థిక్ పటేల్ ని రాహుల్ గాంధీ 200 కోట్లతో కొనేసాడనేది ఈ వైరల్ న్యూస్ సారాంశం. ఇటీవల హార్థిక్ పటేల్, రాహుల్ గాంధీలు అహ్మదాబాద్ లోని ఓ హోటల్ లో కలిశారు. దానికి సంబందించిన ఫుటేజ్ అంటూ ఓ ఫోటో నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది.

ఇందులో కనిపిస్తున్నది హార్థిక్ పటేల్ అని అతడి చేతిలో ఉన్నది డబ్బు సూట్ కేస్ అని ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో హార్థిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి మద్దత్తు ప్రకటించారు. దీనికి బదులుగా రాహుల్ గాంధీ రూ 200 కోట్ల అతడికి ముట్ట చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. బిజెపి ని ఓడించడానికి రాహుల్ గాంధీ, హార్థిక్ పటేల్ మధ్య ఒప్పదం కుదిరినట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మోడీ ప్రధాని అయిన తరువాత సొంత రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో బిజెపి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బిజెపిని ఎలాగైనా దెబ్బ కొట్టాలనే కసితో కాంగ్రెస్ పార్టీ ఉంది.