విమానంలో బట్టలిప్పి బ్లూ ఫిలిమ్స్ చూస్తూ…రచ్చ చేసాడు…

Monday, March 5th, 2018, 05:59:28 PM IST

తాజాగా బంగ్లాదేశ్‌కు చెందిన ఓ ప్రయాణికుడు విమానంలో దారుణంగా ప్రవర్తించాడు. తన బట్టలిప్పేసి, పోర్న్ వీడియోలు చూస్తూ.. విమానంలోని స్టీవార్డ్‌లను హగ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ నానా రబస సృష్టించాడు. మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి ఢాకా వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటు చేస్కుంది. అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి కౌలాలంపూర్‌లో విమానం టేకాఫ్ కాగానే.. తన ఒంటిమీదున్న బట్టలన్నీ విప్పేసి.. తన ల్యాప్‌టాప్‌లో పోర్న్ వీడియోలు చూసినట్లు విమాన సిబ్బంది విషయాన్ని పోలీసులకు వెల్లడించగా. బంగ్లాదేశ్‌కు చెందిన అతడు మలేషియన్ యూనివర్సిటీలో విద్యార్థి అని . వెకిలి చేష్టలు చేస్తూ.. స్టీవార్డులను కౌగిలించుకునే ప్రయత్నం చేశాడని వెల్లడించారు. వాళ్లు దూరం జరపడంతో ఆగ్రహంలో ఓ స్టీవార్డ్‌పై దాడికి కుడా పాల్పడ్డాడు. వెంటనే జోక్యం చేసుకున్న ప్రయాణికులు, ఇతర సిబ్బంది. అతన్ని తన సీటుకు కట్టేశారు. ఢాకాలో విమానం ల్యాండవగానే.. అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి విచారణకు తీసుకు వెళ్ళారు.