జమిలి ఎన్నికలకు మేము సిద్ధం అంటున్న పార్టీ?

Sunday, July 8th, 2018, 05:04:09 PM IST

ప్రతిసారి జరిగే సార్వత్రిక ఎన్నికలు అటు శాసన సభకు, ఇటు లోక్ సభకు ఒకే సారి జరుగుతుంటాయి. అయితే ఈ సారి మాత్రం ప్రభుత్వం జమిలి ఎన్నికలు జరిపేలా పావులు కదుడుతున్నట్లు తెలుస్తోంది. అనగా, లోక్ సభకు సంబంధించి అన్ని రాష్ట్రాలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించేలా ఒక అభిప్రాయం సేకరణను లాకమీషన్ చెప్పట్టింది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మెజారిటీ రాష్ట్రాలు, మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అవి ఆ శాఖల పరిధిలోకి రావంటూ వ్యతిరేకిస్తున్నాయి. ఎట్టిపరిస్థితుల్లో జమిలి జరప కూడదని గట్టిగా చెప్పాయట దాదాపుగా అన్ని పార్టీలు. ఇక వామపక్షాలైతే జమిలి ఎన్నికల అవసరం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే కేంద్ర స్థాయిలో వున్న బిజెపి మరియు కాంగ్రెస్ లు మాత్రం ఇప్పటివరకు తమ స్పష్టమైన నిర్ణయాన్ని తెలపలేదు అంటున్నారు. కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ జమిలి ఎన్నికలకు మేము సిద్దమే అంటూ తమ నిర్ణయాన్ని ప్రకటించిందట.

కాగా ఆ పార్టీ నేత ఎంపీ వినోద్ నేడు ల కమీషన్ ను కలిసి తమ పార్టీ యొక్క నిర్ణయాన్ని వారికి తెలిపారట. 1999 నుండి ఇప్పటివరకు ఒకే సరి అసెంబ్లీ మరియు లోక్ సభకు ఒకే సారి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తమకు జమిలి పై ఎటువంటి అభ్యన్తరం లేదని, తమ పార్టీ నేతలు, కార్యకర్తలందరూ కూడా సిద్ధమేనని తెలిపారట. ఈ నిర్ణయంతో ఆ పార్టీకి రానున్న వై ఎన్నికల పై ఎంత గట్టి నమ్మకం ఉందొ తెలుస్తోంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ ఆ ఎన్నికలు రావాలి, అవి వచ్చినపుడు టిఆర్ఎస్ పార్టీ తమ సత్తా నిరూపించిన గెలిచినప్పుడు కదా అని విపక్ష పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికి కేంద్రం ఆలోచిస్తున్న ఈ జమిలి ఎన్నికల విధానానికి దాదాపుగా అందరినుండి పూర్తిగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు మాత్రం కనపడుతోంది…..

  •  
  •  
  •  
  •  

Comments