ట్యాంక్ బండ్ విగ్రహాలపై రగడ

Tuesday, September 30th, 2014, 08:45:55 PM IST


ట్యాంక్ బండ్ పేరు చెప్పగానే ఠక్కున గుర్తుకు వచ్చేది.. వరుసగా కొలువుదీరిన విగ్రహాలే.. ఇప్పుడు ఆ విగ్రహాలపై గొడవ జరుగుతున్నది. ట్యాంక్ బండ్ పై కొన్ని పనికిమాలిన విగ్రహాలు ఉన్నాయని వాటిని త్వరలోనే తోలిగిస్తామని తెరాస నేతలు పేర్కొనడంతో.. గందరగోళం ఏర్పడింది.. తెరాస చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ నేతలు మరియు తెలంగాణ విపక్ష నేతలు కూడా ఖండించారు..

ట్యాంక్ బండ్ విగ్రహాలపై అనవరస రాద్దాంతం చేస్తున్నారని, తాము తెలంగాణ ప్రముఖుల విగ్రహాలను పంపితే.. ప్రకాశం బ్యారేజ్ పై ఆవిష్కరిస్తారా..? అని తెరాస నేత వేణుగోపాల చారి ప్రశ్నించారు..

దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. తెలుగుజాతి గర్వించ దగ్గ విగ్రహాలను తాము త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని, అందులో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు కూడా ఉంటాయని అన్నారు. తెలుగు జాతి గొప్పదనం చాటి చెప్పిన మహామహుల విగ్రహాలను తోలిగిస్తామనడం సరికాదని అన్నారు.