అతను లేకపోయినా భారత్ ని తక్కువ అంచనా వెయ్యలేం..!

Thursday, September 6th, 2018, 10:34:57 PM IST

ఈ నెల 15 నుంచి యూ ఏ ఈ లో ఆసియాకప్ కి మన ఆసియా ఖండం లోని ముఖ్య జట్టులు అన్ని సంసిద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యం లో భారత్-ఇంగ్లాండ్ టూర్ లో భారత్ ఘోర పరాజయాన్ని చవి చూసిన సంగతి తెలిసినదే, ఇంగ్లాండ్ టూర్ లో భారత్ జట్టు కెప్టెన్ ఐన విరాట్ కోహ్లీ మినహా మిగతా ఆటగాళ్లు అందరు పేలవమైన ప్రదర్శననే కనబర్చి విఫలమయ్యారు. కోహ్లీ ఒక్కడే ఆ సిరీస్ లో 500 పై చిలుకు పరుగులు తీసాడు.

అతను ఒక్కడే ఒంటరి పోరాటం చేసినా గెలవలేదు కావున బీసీసీఐ సెలెక్టర్లు కోహ్లీకి విశ్రాంతిని అందించారు. ఐతే ఇప్పుడు ఆసియ టూర్ కి రోహిత్ శర్మ భారత్ జట్టుకి నాయకత్వం వహించనున్నాడు. ఈ సందర్భం లోనే పాకిస్తాన్ ఆటగాడు ఐన ఫకార్ జమాన్ మాట్లాడుతూ పెద్ద జట్టులో భారత్ కూడా ఒకటి అని, ఈ సిరీస్ కి కోహ్లీ లేకపోయినా మిగతా వారిని తక్కువ అంచనా వెయ్యము అని, ఈ సారి టోర్నీ చాలా రసవత్తరంగా సాగుతుందని, భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలా ఒత్తిడి ఉంటుందని కాకపోతే యూ ఏ ఈ లో మ్యాచ్ లు పర్వాలేదని తెలిపారు..

  •  
  •  
  •  
  •  

Comments