రాహుల్ ఆశీస్సుల వల్లే మేము అధికారం చేపట్టాము : కుమారస్వామి

Thursday, May 31st, 2018, 12:13:20 AM IST


కర్ణాటక నూతన సీఎం కుమారస్వామి అధికారం చేపట్టాక కొత్త రాగం అందుకున్నారని, ఆయన ఏమి మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్ధమవుతుందా అని కొందరు బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజానికి కర్ణాటకలో తాము అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగామంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ దయ, చలువల్లనే అని, అంతే తప్ప ఇక్కడి కన్నడ ప్రజలు ఓట్లు వేయడం వల్ల కాదని కుమారస్వామి అంటున్నారు. కాగా ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించగానే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన రైతు రుణమాఫీ చేయాలనీ తీవ్ర ఒత్తిడి రావడంతో అతి త్వరలోనే ఆ కార్యక్రమాన్ని చేపడతానని, కాకపొతే కాంగ్రెస్ అధినేత రాహుల్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నానని అన్నారు. ఇకపోతే ఇక్కడ కాంగ్రెస్ తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామనుకున్నపుడు కాంగ్రెస్ పార్టీ నేతలు, రాహుల్, సోనియా సహా అందరూ మాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని, పదవుల విషయంలో కూడా మాకే ప్రధమ అవకాశం ఇచ్చినందుకు వారికీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఆయన అన్నారు.

నిజానికి ఇక్కడి ప్రజలు తన మాటలను తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని, నేను అంటోంది రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల మెజారిటి ప్రకారం చూస్తే బిజెపి, కాంగ్రెస్ తరువాత మా పార్టీ మూఢ స్థానం లో నిలిచి కేవలం 37 స్థానాలు మాత్రమే కైవశం చేసుకున్నప్పటికీ మాతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఏమాత్రం ఆలోచించకుండా, పెద్దగా షరతులు పెట్టకుండా ముందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ తనకు ఈ సమయంలో అందరి కంటే ఎక్కువనేది తన వ్యాఖ్యల్లోని అభిప్రాయమని అన్నారు. కాంగ్రెస్ మిత్రత్వంతో రానున్న రోజుల్లో కర్ణాటకకు మరింత అభివృద్ధి పదం లోకి నడిపి ప్రజలకు మరింత చేరువవుతామని కుమారస్వామి అన్నారు. అయితే జేడీఎస్, కాంగ్రెస్ ల అపవిత్ర కలయిక అనేది నీటిమీద రథ వంటిదని, వారి చెలిమి ఎంతోకాలం నిలవద్దని స్థానిక బిజెపి నేతలు విమర్శిస్తున్నారు….

  •  
  •  
  •  
  •  

Comments