ఏపీ బీజేపీలో గ్రూపూలు లేవంటున్న బిజెపి ప్రధాన కార్యదర్శి!

Tuesday, May 15th, 2018, 12:00:36 AM IST

ఏపీ బీజేపీలో గత రెండు రోజులుగా అసంతృప్తి జ్వాలలు రేగుతున్నట్లు తెలుస్తోంది. గుంటూరుకు చెందిన మాజీ మాంత్రి ప్రస్తుత బిజెపి నేత కన్నా లక్ష్మి నారాయణకు ఏపీ బిజెపి అధ్యక్ష పెద్దవి కట్టపెట్టడంతో ఆ పదవి పై ఎన్నో ఆశలు పెట్టుకున్న సోము వీర్రాజు, ఆయన వర్గం అలకబూనినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై నేడు మీడియా సమావేశం ఏర్పాటుచేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళిధరరావు మాట్లాడుతూ, ఏపీ బిజెపిలో ఎటువంటి గ్రూపులు లేవని, తమ పార్టీ క్రమశిక్షణకు పెట్టింది పేరని, అసలు ఇదంతా కూడా మీడియా వారి సృష్టి అని మండిపడ్డారు. ఎవరికి ఇష్టమున్నా లేకున్నా అధ్యక్ష హోదాలో కన్నా కొనసాగుతారని, అసలు పదవులకు కొత్త పాత అనే తేడాలు ఉండవని, ఎవరైనా సరే అధిష్టానం మాటవినాల్సిందే అని అన్నారు.

ఒకప్పుడు మోడీ ప్రధాని అయినపుడు కూడా కొందరు ఆయన ఓబిసి అని బురద చాల్లే ప్రయత్నం చేసినప్పటికీ అటువంటి వారి ఎత్తులు పారలేదన్నారు. కన్నా నేతృత్వంలో ఏపీ లో పార్టీ మరింత మెరుగ్గా ముందుకు సాగుతుందనే నమ్మకంతోనే కేంద్ర అధిష్టానం ఆయనకు ఆ పదవి కట్టబెట్టిందన్నారు. కాగా ఈ విషయమై అలకబూనిన సోమువీర్రాజు నేటి సాయంత్రం విజయవాడలోనిబిజెపి కార్యాలయానికి ఫోన్ చేసిన వీర్రాజు కొంత మెత్తపడ్డట్టు తెలుస్తోంది. అధిష్టానం నిర్ణయమే తనకు శిరోధార్యమని, తన అనుచరగణాన్ని కానీ, ఇతర పార్టీ నేతలు, కార్యకర్తలెవరు కూడా వారి నిర్ణయాన్ని ఇకపై వ్యతిరేకించబోరని ఈ సందర్భంగా ఆయన చెప్పినట్లు సమాచారం……..

  •  
  •  
  •  
  •  

Comments