అద్దె ఇళ్ళు, అద్దె వస్తువులు చూసాం, కానీ భార్యలు కూడానా……

Sunday, September 2nd, 2018, 11:50:18 AM IST

మనం నివాసముండే గూడు కోసం ఇల్లు కట్టుకోలేని వారు నెలకు కొంతమొత్తాన్ని కట్టి ఇల్లు అద్దెకు తీసుకోవడం అందరికి తెలిసిందే. ఆ పై వాహనాలు, కొన్ని రకాల వస్తున్నావు అద్దెకు ఇవ్వడం చూస్తుంటాం. ఇక ఇటీవల కొన్నాళ్ళనుండి ఇంటికి కావలసిన ఫర్నీచర్, ఇక ప్రస్తుతం అద్దెకు మొబైల్ ఫోన్లు కూడా దొరికే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ అటుంచితే, మధ్య ప్రదేశ్, గుజరాత్ లోని కొన్ని గ్రామాల్లో ఏకంగా కొందరు తాము కట్టుకున్న భార్యలని అద్దెకు ఇస్తున్నారు. ఇది వినడానికి నిజంగా ఎంతో హేయంగా, ఇబ్బందిగా వున్నా, అక్కడ ఇప్పటికీ కూడా కొనసాగుతున్న ఆచారం ఇది. ఇప్పటికే ఎన్నో ఏళ్ళనుండి మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఈ అద్దె భార్యల తంతు మరీ ఎక్కువగా వుంది. దీనికి ప్రధాన కారణం అక్కడ పెళ్ళికావలసిన అబ్బాయిల సంఖ్య ఎక్కువగా, పెళ్లికాని యువతుల సంఖ్య మరీ తక్కువగా వుండడమట.

ధనికులైన ఇళ్లలోని పెళ్లి కాని అబ్బాయిలు తమకు పెళ్లిళ్లు కావడం ఆలస్యం అవడం మరియు మరికొందరికైతే ఎప్పటికీ పెళ్లి కాకపోవడంతో అప్పట్లో వీరి పూర్వికులు ఈ అద్దె భార్యల తంతుకు శ్రీకారం చుట్టారు. అక్కడ దీనిని ‘దఢీచ ప్రథ’ అనే ఒక ఆచారంగా పిలుస్తారు. దీని ప్రకారం పెళ్ళికావలసిన యువకులు, తమకు నచ్చిన స్త్రీలను ఎంపిక చేసుకుని వారి ఇంట్లో వాళ్ళతో మాట్లాడి, ఆ స్త్రీలను ఆరునెలలు, ఒక సంవత్సరం లెక్కన వారిని నెలకు కొంత అద్దెకి ఆమె కుటుంబసభ్యులకు చెల్లించి తమ అవసరాలను తీర్చేందుకు ఇంటికి తెచుకుంటునారు. అయితే తమకు నచ్చిన ఆడవారి ఎంపిక ప్రకారం నెలకు రూ. 500 నుండి రూ. 50000వారకు ధర నిర్ణయించడం, ఆపై స్టాంపు పేపర్ పై వారికీ ధర, మరియు తమతో ఉండవలసిన గడువు నిర్ణయించి, ఆ ప్రకారం వారికుటుంబాలకు ధర చెల్లించడం చేస్తుంటారు. నిజానికి సంతలో పశువులను వేలం వేశినట్లు ఇలా ఆడవారిని వేలంవేయడంపై అక్కడి స్త్రీలు ఎవరు కూడా నోరు మెదపకపోవడం గమనార్హం.

మరొక ఆశ్చర్యకర విషయం ఏమిటంటే కొందరు భర్తలు తమ భార్యలను డబ్బు కోసం వేరొకరికి అద్దె భార్యలుగా దగ్గరుండి మరీ పంపడం చేస్తున్నారు. అదేమిటని అక్కడి ఆడవారిని ప్రశ్నిస్తే, మేము మా కుటుంబాల ఆర్ధిక సమస్యలే ఇలా మమ్మల్ని అద్దెకి ఇవ్వడానికి కారణమవుతున్నాయని, మాకు పెళ్లి అయిన దగ్గరినుండి భర్తే సర్వస్వం. అందువల్ల అయన ఏది చెప్పిన చేయకతప్పదని, అందువల్ల ఇటువంటి వాటిని అడ్డగించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గుజరాత్ లోని భరుచ్ ప్రాంతంలోనూ ఇటువంటి అద్దెభర్యల నీచ ఆచారం ఉందని, అయితే ఈ అద్దె భార్య విధానంపై అక్కడి స్థానిక మహిళా సంఘాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ, అక్కడి ఆడవారు వీటిపై నోరు మెదపకపోవడంతో మేము ఏమి చేయలేకపోతున్నామని, ఇకనైనా ప్రభుత్వ పెద్దలు గట్టిగా చొరవ తీసుకుని ఈ చుట్టుప్రక్కగాలి ప్రాంతాల్లో జరుగుతున్న ఈ దురాచారాన్ని అడ్డగించాలని అక్కడి సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి…..

  •  
  •  
  •  
  •  

Comments