ప్రవర్తన సరిగా లేకనే, గంబీర్ ను టీం నుండి తప్పించాము

Sunday, April 29th, 2018, 01:25:36 PM IST

జరుగుతున్న పరిస్థితులనిబట్టి చూస్తే టీం ఇండియా క్రికెటర్ గౌతమ్ గంబీర్ ప్రస్తుతం కొంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అతని ప్రవర్తన తీరు, వ్యవహార సరళి సరిగా లేకపోవడం వల్లనే భారత్ తుది జట్టులో గంభీర్ కు చోటు కల్పించలేకపోయాం అని బిసిసిఐ సెలక్షన్ కమిటీ చీఫ్ సందీప్ పటేల్ అన్నారు. నిజానికి గంబీర్ కు ఆవేశం కాస్త ఎక్కువని, ఈ సమస్య ఇటీవల అతడిలో మరింత పెరిగిందని అన్నాడు. జరిగిన 2011 ఇన్లాండ్ సిరీస్ లో గంభీర్ కు బౌన్సర్ తగిలాకా అతడు ఇండియా కు తిరిగి వచ్చాడని, అదే అతనికి పెద్ద చేటు చేసిందని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. గంభీర్ జరిగిన ఐపియల్ జట్టు కెప్టెన్ పదవి నుండి దిగిపోగానే అతడికి తుదిజట్టులో చోటు దక్కకపోవడం ఆశ్చర్యం అని అన్నారు.

నిజానికి తాను, గంభీర్ చాలా ఏళ్లుగా స్నేహితులమని, అయితే అతడి ప్రవర్తన కారణంగా జట్టు నుండి తప్పించమని, అతడు తన స్నేహాన్ని వదులుకున్నాడని అన్నారు. గంభీర్ అభిమానులు అతడికి జట్టులో చోటు దొరకకపోవడం పై చేస్తున్న విమర్శలకు ఆయన సమాధానమిస్తూ దానితో కెప్టెన్ కు గాని, యాజమాన్యానికి కానీ ఎటువంటి ప్రమేయం లేదన్నారు. అయితే కావాలనే గంభీర్ శుక్రవారం నాటి మ్యాచ్ నుండి తప్పుకున్నాడని కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా వెల్లడించినట్లు తెలిపారు. గంభీర్ స్నేహితుడిగా అతని ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవాలని సలహా ఇస్తున్నానని అన్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments