కాంగ్రెస్ గెలిస్తే దళితుడే ముఖ్యమంత్రి : సిద్దరామయ్య

Sunday, May 13th, 2018, 10:45:57 PM IST


మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికలు ఎంతో ఉత్కంఠతో జరిగిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఫలితాలపైనే అందరి దృష్టి వుంది. ఒకవైపు ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ మళ్లి మేమే అధికారంలోకి వస్తాం అంటుంటే, మరోవైపు బిజెపి నేతలు కూడా ఫలితాలపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. జేడీఎస్ పార్టీ నేతలు దేవెగౌడ, కుమార స్వామి కూడా బలమైన నమ్మకంతో వున్నారు. నిజానికి ఎన్నికలముందు హంగ్ ఏర్పడుతుందని కొన్ని సర్వేలు చెపుతున్నప్పటికీ హంగ్ ప్రసక్తే లేదని ఏపార్టీకి ఆ పార్టీ తమగెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇదిలా ఉంటే ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వస్తే ఒక దళితుడిని సీఎం చేయడానికి సిద్ధంగా ఉన్నామని సంచలన ప్రకటన చేసారు. గెలిచిన ఎమ్యెల్యేలు అధిష్టానం మాట వినాలని, అందరూ కలిసికట్టుగా ఉంటేనే ప్రజలకు నిజమైన అభివృద్ధి అందించగలమన్నారు.

అయితే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాం అన్న సిద్దరామయ్య ఇక్కడ ఒక చిన్న మెలిక పెట్టారు. గెలిచిన వారిలో ఎవరిని ముఖ్యమంత్రిగా గద్దెనెక్కించాలనేది అధిష్టానం నిర్ణయం మీద ఆధార పడివుంటుందని మెలిక పెట్టారు. కాగా హంగ్ ఏర్పడుతుందన్న భావనతోనే ఆయన జేడీఎస్ పార్టీ ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని, ఎందుకంటె ఇప్పటికే కొందరు జేడీఎస్ మాత్రం ఈ ఎన్నికల్లో ఒకవేళ కింగ్ కాకపోయినా ప్రభుత్వ ఏర్పాటులో కీలకమైన కింగ్ మేకర్ పాత్ర పోషిస్తుందనేది విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఎవరు అధికారం లోకివస్తారు, ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలియాలంటే ఈనెల 15న వెల్లడయ్యే ఫలితాల వరకు వేచిచూడవలసిందే మరి……..