‘మా’ నిధుల గోల్ మాల్ పై నిజ నిర్ధారణ కమిటీ వేయాలి!

Monday, September 3rd, 2018, 09:27:13 PM IST

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో జరిగిన నిధుల గోల్ మాల్ పై కొద్దిరోజులుగా మా సభ్యుల మధ్య కొన్ని అంతర్గత విబేధాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే నేడు వాటిపై మీడియాతో మాట్లాడి వివరణ ఇచ్చిన మా అధ్యక్షులు శివాజీరాజా, తనపై కొందరు బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారని, నిజానికి మా నిధుల విషయంలో ఒక్క పైసా కూడా గోల్ మాల్ జరగలేదని, అన్ని విషయాలు అందరూ సభ్యుల ఆమోదంతోనే జరుగుతున్నాయని, ఒకవేళ తాను ఏదైనా తప్పు చేసి, డబ్బు దుర్వినియోగం చేసినట్లు కనపడితే తనకున్న ఆస్తి ఆస్తిమొత్తం రాసి ఇవ్వడానికి సిద్ధమని శివాజీరాజా అన్నారు. ఇక మరొక సభ్యులు హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ, తమపై లేనిపోని నిందలు వేస్తున్నారని, సిల్వర్ జూబిలీ వేడుకలకు సంబందించిన ప్రతి ఖర్చును ఎప్పటికపుడు అందరూ సభ్యులకు తెలుపుతున్నామని, తాము ఎటువంటి దాపరికాలు అమలు చేయడం లేదని అయన అన్నారు. మా సభ్యుల్లో కొందరు కావాలనే తమపై నిందలు వేసి, తమ ఇమేజిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అయితే ఈ విషయమై శివాజీ రాజా, శ్రీకాంత్ లు సినీయర్ హీరో నరేష్ ని ఇండైరెక్ట్ గా టార్గెట్ చేసినట్లు చెపుతున్నాయి సినీ వర్గాలు. కాగా నేటి సాయంత్రం ఈ విషయమై గౌతమ్ రాజు, హేమలతో కలిసి మీటింగ్ ఏర్పాటు చేసిన నరేష్,

మా నిధుల్లో కొంత గోల్ మాల్ జరిగిన మాట నిజమేనని, తన తల్లి సహా కొందరు పెద్దలు మాకు కొన్ని వేల రూపాయలు విరాళాలుగా ఇస్తుంటే, వాటిని మా అధ్యక్షులు మరియు కొందరు సభ్యులు ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల మా సభ్యులు బిజినెస్ క్లాస్ టికెట్ తో అమెరికాకు వెళ్లడం నిజం కాదా, అసలు అంత సంస్ధడబ్బు ఖర్చు ఎందుకు పెట్టవలసింది, దీనిపై శివాజీరాజా తప్పకుండ సమాధానం చెప్పవలసిందే అని అన్నారు. కొన్నాళ్ల క్రితం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో శివాజీ రాజాతో నువ్వే ఎన్నికల్లో పోటీ చేయి, నువ్వు అధ్యక్షుడుగా వుండు, నేను తప్పుకుంటాను, కావాలంటే నేను ఏదో ఒక సభ్యుడిగా వుంటాను అని శివాజీరాజాతో అన్నట్లు చెప్పారు నరేష్. అలా తనని ఎంకరేజ్ చేసిన నేను, ఇవాళ జరిగిన విషయాన్ని ప్రశ్నిస్తున్నానేతప్ప నిందలు వేయడం లేదని అన్నారు. ఒక పెద్ద పార్టీకి జనరల్ సెక్రెటరీగా పనిచేసిన అనుభవమున్న నేను, ఎప్పుడు నిజాయితీగా ధర్మం తో వ్యవహరించానేతప్ప అధర్మం పాటించలేదని అయన అన్నారు.

చిరంజీవి గారి సిల్వర్ జూబిలీ కార్యక్రమం సమయంలో శివాజీని చేయమని చెప్పను, అయితే కొటేషన్ల విషయమై నన్ను సంప్రదించలేదు, అలా పలుమార్లు తనను తప్పించడంతో తదుపరి మహేష్ తో చేసే కార్యక్రమంపై తనకు ఆసక్తి లేదని, మహేష్ మరియు నమ్రతలతో ఆ ప్రోగ్రామ్ కి తాను రాలేనని కూడా చెప్పను అన్నారు. అయితే ఇదివరకు ఒక సందర్భంగా ఫోన్ చేస్తే శివాజీ ఫ్లైట్ లో వున్నాను అంటూ చెప్పాడు, ఎవరితో వెళ్తున్నావ్ ఏంటి విషయం అని అడిగితే సరిగా సమాధానం చెప్పలేదు. ఆ తరువాత ఎన్నిసార్లు కాల్ చేసిన తీయకుండా నా నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టాడు. అసలు ఏమి జరిగిందో, ఎందుకు అంత ఖర్చు చేసారు అంటే అన్నిటికి రికార్డులు వున్నాయి అంటున్నారు. పోనీ తన వద్ద వున్న పెన్ డ్రైవ్ లో డేటా అయినా భద్రంగా ఉందా అంటే అది పాడయిందని చెపుతున్నారని అన్నారు. ఆ తరువాత మొన్న బయట కనిపిస్తే హలో బ్రదర్ అంటూ శివాజీ మాట్లాడడం తనకు నచ్చలేదని, కాబట్టి మా నిధుల గోల్ మాల్ విషయమై ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి నిజానిజాలను బయటపెట్టాలనేది తన విజ్ఞప్తి అని అయన అన్నారు….

  •  
  •  
  •  
  •  

Comments