ఆ జిల్లాకు అల్లూరి పేరును పెడతాం : వైఎస్ జగన్

Saturday, May 26th, 2018, 03:45:40 AM IST


వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం తాను చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా 171 వ రోజు కాగా, ఆయన నేడు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చేరుకున్నారు. ఆకివీడులోకి ప్రవేశించగానే స్థానిక మహిళలు ఆయనకు హారతులిచ్చి ఊరులోకి ఘన స్వాగతం పలికారు. అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ, ఆకివీడు పోరాటాల గడ్డ అని, మన్యం వీరుడు సీతారామరాజు నాటి తెల్లదొరలు తరిమికొట్టి వీరోచితంగా పోరాడిన ఈ గడ్డను ప్రస్తుత ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. చంద్రబాబు సహా ప్రభుత్వాలేవీ కూడా అల్లూరిని సరైన రీతిన గౌరవించలేదని, ఒకవేళ మన ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఈ జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లాగా నామకరణం చేస్తామని ప్రకటించారు. ఇక్కడి క్షత్రియులను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని,

ఈ విషయమై పలువురు క్షత్రియ కులస్థులు తన వద్దకు వచ్చి టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను గురించి చెప్పుకున్నారన్నారు. వైసిపి అధికారంలోకి వస్తే ఇక్కడి క్షత్రియులకు కూడా తమ వంతుగా ప్రభుత్వం తరపున సాయం అందిస్తామని ఆయన అన్నారు. కాగా జగన్ ప్రకటనతో చుట్టుప్రక్కల ప్రజలందరూ ఆనందోత్సాహాలతో హర్షద్వానాలు చేసారు. కాగా ఇదివరకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీఆర్ గారి సొంత వూరు అయిన కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఆయన యాత్ర సాగినపుడు వైసిపి అధికారంలోకి వస్తే ఆ జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెడతామని ఆయన హామీ ఇచ్చిన విషయం తెలిసిందే…..

  •  
  •  
  •  
  •  

Comments