అటువంటి వారు మారక తప్పని పరిస్థితులు కల్పిస్తాం : కత్తి వ్యాఖ్యలపై పరిపూర్ణానంద

Thursday, July 5th, 2018, 11:30:33 AM IST

ప్రముఖ ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ హిందువుల దేవుడు శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికే పలువురు ప్రముఖులు మరియు ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఈ విషయమై కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి మాట్లాడుతూ, కత్తి మహేష్ వంటి వ్యక్తులు సమాజానికి చేటని, రాముడి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇక మెగా బ్రదర్ నాగ బాబు స్పందిస్తూ, కత్తి మహేష్ లాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోకుంటే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు ఏర్పడతాయని ఆయన అన్నారు. కాగా నేడు కత్తి అనుచిత వ్యాఖ్యలపై ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించిన స్వామి పరిపూర్ణానంద, కత్తి మహేష్ వేరే మతం వ్యక్తి కాబట్టి రాముని పై వ్యాఖ్యలు చేసారా, లేక మరే ఇతర పేరు, పలుకుబడి వంటివి ఆసించి చేసారా అనేది తేలాలి అన్నారు .రామాయణం గురించి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా సమాజానికి ఏమి మెస్సేజి ఇవ్వాలని చూస్తున్నారు అని అన్నారు.

కత్తికి రామ్ గోపాల్ వర్మ వంటి వ్యక్తులు దేవుడు గా కనపడతారు తప్ప సాక్ష్యాత్తు భగవత్ స్వరూపుడు అయిన రాముని వంటివారు కాదని, అలా మాట్లాడడం ఆయన నీచత్వానికి నిదర్శనమని అన్నారు. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఒక ఉన్మాద క్రీడ వంటివని, ఇలా మాట్లాడి పైశాచిక ఆనందగమ పొందుతున్నారని విమర్శించారు. కాగా అటువంటి వ్యక్తులకు మేము తగిన బుద్ధి చెపుతామని, బుద్ధి చెప్పడం అంటే భౌతికంగా, ఇబ్బంది పెట్టె దాడులు కావని, ఒకవేళ ఏదైనా కుక్క వచ్చి అనుకోకుండా మహేష్ పై దాడి చేస్తే సాటి మనిషిగా ఆయనను కుక్క నుండి రక్షిస్తామని చమత్కరించారు. కత్తి మహేష్ వంటి వ్యక్తులు వారంతట వారే మారే వరకు కట్టుదిట్టమైన ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. వారు మారకతప్పని పరిస్థితులు కల్పిస్తామని, అన్యమతస్థులు ఎందరో హిందువు దేవుళ్లను చాలా వరకు విమర్శించరని, కానీ కత్తి వంటి వ్యక్తులు మాత్రం మతాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. అటువంటివారి శైలిని మార్చుకునేలా దేవుడే ఆయన మనసు మారుస్తాడని, తమకు నమ్మకం ఉందని అన్నారు….

  •  
  •  
  •  
  •  

Comments