పవన్ సీఎం కావాలని రొట్టెలు మార్చుకున్న అభిమానులు..!

Saturday, September 22nd, 2018, 06:58:46 PM IST


కుల మతాలకు అతీతంగా నెల్లూరు జిల్లాలో బార సాహీద్ దర్గాలో ఎంతో మంది భక్తులు వారి ప్రార్ధనలు నెరవేరాలని స్వర్ణాల చెరువు వద్ద రొట్టెల మార్పిడి చేసుకుంటారు.ఈ పండుగను అక్కడికి వచ్చిన ప్రతీ ఒక్కరు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు.ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా ఈ రొట్టెల పండుగకు తన స్నేహితుడు అలీ తో హాజరు కానున్నారని ఇప్పటికే అందరికి తెలుసు దానితో అక్కడ భారీ ర్యాలీలు కూడా అభిమానులు చేశారు.

ఐతే అక్కడికి వచ్చిన కొంత మంది అభిమానులు మాత్రం తమ నాయకుడు వచ్చే ఎన్నికలలో ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం అని అందుకని వారు రొట్టెలు మార్చుకోవడానికి వచ్చామని తెలియజేసారు.అంతే కాకుండా ఆయన ఆరోగ్యంగా ఉండాలని 2019 లో ఆయన సీఎం అయ్యి రాష్ట్రానికి మంచి చెయ్యాలని అక్కడికి వచ్చిన మహిళా కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు.ఈ రోజు రాత్రికి పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకొని తాను కూడా రొట్టెను స్వర్ణాల చెరువులో వదులుతారు అన్నట్టుగా తెలుస్తుంది.