వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతాం : కేసీఆర్

Thursday, January 18th, 2018, 04:43:37 PM IST

రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో తాము ఎవ్వరితోను పొత్తు పెట్టుకోమని గురువారం నిర్వహించిన ఇండియా టుడే కాన్ క్లేవ్ లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ స్పష్టం చేశారు. ఆ కార్యక్రమం లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో ఎన్డీయే తో కలుస్తారా ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు, నిజానికి మాతో కలవాలా వద్దా అన్నది ఎదుటివారు నిర్ణయించుకోవలసిన విషయమని అత్యంత చాకచక్యంగా సమాధానం ఇచ్చారు. తమ అభివృద్ధి కార్యక్రమాలే శ్రీరామ రక్ష అని, ప్రజా సంక్షేమ పధకాలు మరెన్నో భవిష్యత్తులో ప్రవేశపెట్టి ప్రజల్లో కి మరింతగా వెళ్ళాలి అన్నదే వారి ఆలోచన అన్నారు. రాష్ట్ర సచివాలయం విషయంలో మలేషియా మంత్రి చేసిన వ్యాఖ్యలతో తాను ఆలోచనలో పడ్డట్టు ఆయన తెలిపారు. ఇంత సంపన్న రాష్ట్రంలో సచివాలయం ఏంటి ఇలావుంది అనడం తనని కలచి వేసిందని, అందుకే రానున్న రోజుల్లో అద్భుత రీతిలో సచివాలయ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.