వారిని వ్యతిరికేంచే వారితో కలిసి పని చేస్తాం : నారా లోకేష్

Thursday, May 24th, 2018, 12:18:03 PM IST

కేంద్ర ఎన్డీయేలోని బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ కి చాలా అన్యాయం చేసిందని, రాబోవు 2019 సార్వత్రిక ఎన్నికలలో ఏపీ ప్రజలు వారికి సరైన రీతిలో బుద్ధి చెబుతారని బీజేపీ ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు ఐటి మంత్రి నారా లోకేష్ . విజయవాడ లో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన కర్ణాటకలో బిజెపికి ప్రజలు చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చారని, అదేవిధంగా ఇక ఫై బీజేపీ ఏ రాష్ట్రం లో కూడా గెలవదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకహోదా, విభజన హామీల విషయమై ఇచ్చిన హామీ లు నెరవేర్చలేదు సరి కదా కనీసం పట్టించుకున్న దాఖలాలు కూడా లేవని అని అన్నారు…..

అంతే కాకుండా ఇతర రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం అయి కలిసి కట్టుగా బీజేపీ కి బుద్ధి చెప్పాలని అభిప్రాయ పడ్డారు. రాష్ట్రంలో పెద్దఎత్తున ఒక భారీ బహిరంగసభ ను నిర్వహించి అన్ని ఇతర ప్రాంతీయ పార్టీ నేతల ని ఆహ్వానించే యోచనలో చంద్రబాబు ఉన్నారని తెలిపారు. మరియు ముఖ్య మంత్రి చంద్రబాబు గారు భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్ల్లో చక్రం తిప్పనున్నారని , అందువలన ప్రాంతీయ పార్టీలన్ని కలిసి కట్టు గా పని చేసి బీజేపీ కి సరైన గుణపాఠం చెప్పాలని అభిప్రాయం పడ్డారు………

  •  
  •  
  •  
  •  

Comments