రానున్న ఎన్నికల్లో మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : పవన్ కళ్యాణ్

Sunday, May 20th, 2018, 02:24:09 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కాలినడకన తిరుమల చేరుకొని వెంకటేశ్వరుని దర్శనం తరువాత ఆయన చిత్తూర్ జిల్లా పర్యటనకు బయలు దేరారు. ఆ జిల్లాలోని పలు ప్రాంతాలు చుట్టిన పవన్ అక్కడి స్థానిక ప్రజల కష్టనష్టాలను అడిగి తెలుసున్నారు. కాగా ప్రస్తుతం ఆయన చేపట్టిన పోరాట యాత్ర శ్రీకాకుళంలో సాగుతోంది. మొన్న శనివారం రాత్రి ఇచ్చాపురంలో బసచేసిన పవన్ తెల్లవారిన తరువాత కపస కుర్ది సముద్ర ప్రాంతం వద్ద గంగమ్మకు పూజలు చేసి తన ప్రజా పోరాట యాత్రను ప్రారంభించారు. శ్రీకాకుళంలో పర్యటిస్తున్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. రానున్న 2019 ఎన్నికల్లో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేసారు.

ప్రజలందరి ఆశీస్సులతో ముందుకు వెళ్తున్నామని, ప్రస్తుతం తాను యాత్ర చేస్తోంది ఓట్ల కోసం కాదని, ప్రజాసమస్యలపై అవగాహనా కోసమని పవన్ తెలిపారు. తమ పార్టీ అందరిలా కులాల మధ్య చిచ్చు పెట్టకుండా అందరికి సమన్యాయం చేసేలా వ్యవహరిస్తుంది తెలిపారు. శ్రీకాకుళం కష్టానికి, దేశ భక్తికి ప్రతీక అని, ఉద్దానం సమస్యలు ఇప్పటికే ప్రభుత్వం ముందుకు తీసుకుకెళ్లనాని, అయితే వారినుండి సరైన స్పందన రాలేదని అన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని ప్రజలు, యువత సరైన ఉపాధిలేక వలసలు వెళుతున్నారని, వలసలను నియంత్రించే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. నేను హామీలు ఇవ్వడానికి రాలేదు,

తాము ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలి అంటే మొదట ప్రజా సమస్యలు తెలుసుకోవడం, వాటిపై అవగాహనా కోసం పోరాట యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే నియంతృత్వ పార్టీల పోకడలు, విధానాలతో ప్రజలు విసిగివున్నారని, చంద్రబాబు గత ఎన్నికలప్పుడు చెప్పినది ఒకటి, చేసినది ఒకటి అని మండిపడ్డారు. కాగా పవన్ నేడు మధ్యాహ్నం 3గంటలకు స్థానిక సూరంగి రాజా వారి మైదానంలో అక్కడి ప్రజలతో కలిసి బహిరంగ సభలో పాల్గొంటారని జనసేన కార్యకర్తలు చెపుతున్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments