మాల్యా, నీరవ్ లను భారత్ కు అప్పగిస్తాం కానీ…..

Wednesday, June 13th, 2018, 09:52:47 AM IST

భారత ఆర్ధిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్ మోడీల మోసానికి బ్యాంకులు కోలుకోలేని పెద్ద దెబ్బతిన్నాయనే చెప్పాలి. ఎందుకంటే పదులు కాదు, వందలు కాదు, కొన్ని వేల కోట్ల రూపాయల మేర మోసానికి పాల్పడ్డ ఈ ఇద్దరు ప్రస్తుతం బ్రిటన్ లో తలదాచుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయమై నిన్న బ్రిటన్ బ్రిటన్ మంత్రి బరోనెస్ విలియమ్స్ మన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుతో మాట్లాడారని సమాచారం. వారిద్దరిని భారత్ కు అప్పగిస్తామని చెపుతూనే ఇరుకునపెట్టే ఒక మెలిక పెట్టినట్లు తెలుస్తోంది. నిజానికి బ్రిటన్ లో దాదాపు 75వేల మందికి పైగా అక్రమ వలసదారులు నివాసముంటున్నారని, అందులో మరీ ముఖ్యంగా భారత సంతతివారు ఎక్కువగా ఉన్నారట.

అటువంటి అక్రమ వలసదారులు దేశం నుండి బహిష్కరించే విషయంలో గత ఏప్రిల్ లో బ్రిటన్ లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించగా, తొలుత అటువంటివారి బహిష్కరణకు ఒప్పుకుంటున్నాం అంటూనే దాని తాలూకు బిల్లు పై ఆయన సంతకం చేయలేదని, అందువలన తాము కూడా ఆ ఇద్దరు ఆర్ధిక నేరగాళ్లను భారత్ కు పంపించే విషయమై మరొక్కసారి ఆలోచించుకోవలసి వస్తుందని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విధంగా భారత్ ఆశలకు గండికొట్టిన బ్రిటన్ నీరవ్, మల్యాలను మనకు అప్పగించే విషయమై రానున్న రోజుల్లో ఎటువంటి చర్యతీసుకోనుందో, తదనుగుణంగా మన కేంద్రప్రభుత్వం ఏవిధంగా ముందుకువెళ్ళనుందో వేచిచూడాలి మరి…..

  •  
  •  
  •  
  •  

Comments