రానున్న ఎన్నికల్లో ఏపీలో గెలుపు మాదే : మాజీ ఎంపీ కృష్ణంరాజు

Wednesday, May 16th, 2018, 02:38:13 AM IST

ప్రముఖ సీనియర్ నటులు మాజీ బిజెపి ఎంపీ కృష్ణం రాజు కర్ణాటక ఎన్నికల ఫలితాలపై తన స్పందన తెలియచేసారు. మోడీ పాలనలో ప్రజలు సుభిక్షంతో వున్నారని, అందుకే కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ఎన్ని కుతంత్రాలు పన్నినప్పటికీ మెజారిటీ సీట్లు ప్రజలు మా పార్టీకి అందించారన్నారు. అంతే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కర్ణాటకలో తెలుగు వారెవరు బిజెపి కి ఓటు వేయొద్దని తన కుటిలబుద్ధితో పిలుపునిచ్చారని, అయినప్పటికీ తెలుగు వారు తమపార్టీకి పూర్తి మద్దతు ప్రకటించారని అన్నారు. ఇప్పటివరకు తమ పార్టీకి ఉత్తర భారతదేశ పార్టీగా వున్న ముద్ర ఈ ఎన్నికల్లో విజయం తో తొలగిపోయిందని అన్నారు. టీడీపీ పన్నిన కుట్రలేవి అక్కడ ఏమాత్రం పనిచేయలేదని,

అదే మాదిరిగా ఇక్కడ రానున్న ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు. కాగా కృష్ణం రాజు ఇదివరకు 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున రాజమండ్రి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం మళ్లి ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కర్ణాటకలో గెలుపుపై మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ కూడా హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు, కేసీఆర్ లు కుట్రపన్ని కర్ణాటకలో తెలుగు వారి మద్దతు తమకు లభించకూడదని ఆశించారు. అయినప్పటికీ మేము మంచి అద్భుత విజయం అందుకున్నాము. ఈ విజయం ఆ ఇద్దరికీ చెంప పెట్టులాంటిదని, రాబోయే ఏపీ, తెలంగాణ ఎన్నికల్లో కూడా ఈ విధంగానే సత్తా చాటుతామని అన్నారు……..

  •  
  •  
  •  
  •  

Comments