2019 ఎన్నికల్లో విజయం మాదే : వై వి సుబ్బారెడ్డి

Monday, May 14th, 2018, 07:31:45 PM IST

వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత కొద్దిరోజులుగా నిర్విరామంగా అకుంఠిత దీక్షతో ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన యాత్ర 2000కి. మీ. మైలురాయిని దాటింది. ఆయన యాత్ర చేపట్టిన ప్రతి జిల్లాలోను ప్రజలు ఆయనకు బ్రహ్రరథం పడుతున్నారని, టీడీపీ మోసపూరిత పాలనకు విసిగిపోయిన ప్రజలు జగన్ మోహన్ రెడ్డిగారిని ముఖ్యమంత్రి హోదాలో చూడాలనుకుంటున్నారని అన్నారు. టీడీపీ పాలనలో వారి మేనిఫెస్టోలో చెప్పిన దాదాపు 80 శాతం పైగా అభివృద్ధి కార్యక్రమాలను ఆ పార్టీ వారు పక్కన పెట్టారని, ప్రతి చోట ఆ పార్టీనేతల అవినీతి పెరిగిపోయిందని, ఈ విషయమై ప్రజలు టీడీపీపై బహిరంగంగానే నిప్పులు చెరుగుతున్నారని అన్నారు. బాబు వస్తే జాబు వస్తుంది అన్నారు.

బాబు వచ్చారు, జాబు రావడం మాటేమోకాని, వున్న చిన్న చితక జాబులు కూడా పోయేలా ఉన్నాయని, యువత ఉద్యోగాలకోసం పరాయి రాష్ట్రాలకు వెళుతున్నారని, వైసిపి అధికారంలోకి వస్తే యువతకు తగిన ఉపాధి చూపిస్తామని, ఎక్కడికక్కడ వున్నా స్థానిక సంస్థలు, పరిశ్రమలలో స్థానికతకు పెద్ద పీత వేయడం ద్వారా ఏ ప్రాంతంవారికి ఆ ప్రాంతంలోనే ఉపాధి దొరికేలా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. టీడీపీ ప్రభావం ప్రజల్లో తగ్గింది కాబట్టే బాబుకి ఇప్పటికిప్పుడు ప్రజలు గుర్తుకువచ్చారని, నాలుగేళ్లు ప్రజలను ప్రత్యేక ప్యాకెజీ పేరుతో మోసగించిన ఆయన హోదాను తొక్కి పట్టరాని, నేటి రాష్ట్ర పరిస్థితులకు కారణం చంద్రబాబే అని అన్నారు…..

Comments