విశ్వాస తీర్మానంలో గెలుస్తాం : కుమార స్వామి

Friday, May 25th, 2018, 03:09:43 PM IST

కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి నేటి మధ్యాహ్నం కర్ణాటక అసెంబ్లీ లో ఎట్టకేలకు విశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. అంతకముందు అసెంబ్లీ బయట మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ తనకు ఎటువంటి భయం కానీ, ఆందోళన కానీ లేదని, ఎందుకంటే బలపరీక్షలో నెగ్గేది మేమె అని ఆయన స్పష్టం చేశారు. ఇక సభలో ఆయన ప్రసంగిస్తూ, కర్ణాటకలో ఏ పార్టీకి కూడా సరైన మెజారిటీ రాకుండా ఇలా హంగ్ ప్రభుత్వం ఏర్పడడం కొత్తేమి కాదని అన్నారు. ఇదివరకు 2004 లో కూడా ఇలాగే జరిగిందని చెప్పారు.ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే తాము సంకీర్ణ ప్రభుత్వం దిశగా అడుగులు వేశామని, ఈ ప్రభుత్వంలో ప్రజలకు సరైన రీతిలో సమర్ధవంతమైన పాలన అందించగలమని ఆయన అన్నారు. తమకు మద్దతు పలికి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తున్న కాంగ్రెస్ నేతలకు హృదయ పూర్వక ధన్యవాదములు తెలిపారు.

కేంద్రంలో అధికారంలో ఉన్నామని, ఇక్కడ బిజెపి ఎన్నో ఎత్తుగడలతో, కుట్రపూరితంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వ్యవరించిందని, అయినా చివరికి న్యాయం, ధర్మమే గెలిచాయని ఆయన అన్నారు. అంతేకాక స్పీకర్ ను ఏకగ్రీవంగగా ఎన్నుకున్నందుకు సభికులకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎన్నడూ పదవుల కోసం పాకులాడలేదని, తమకు ప్రజా రక్షణ, ప్రజలకు సుపరిపాలన అందిచడమే ద్యేయమని చెప్పారు. ఇక ప్రత్యేక పరిస్థితుల్లోనే ఈ విశ్వాస పరీక్ష ఏర్పాటుచేయవలసి వచ్చిందని అయన అన్నారు……

  •  
  •  
  •  
  •  

Comments