ఏపీ పాలన అలా ముందుకు..

Thursday, September 25th, 2014, 04:07:21 PM IST

babu
ఏపి ప్రభుత్వం దసరా నుంచి సంక్షేమ బాట పట్టనుంది. ప్రభుత్వం ఏర్పడి వందరోజులు పూర్తిచేసుకున్న చంద్రబాబు ఇక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇందుకోసం దసరా నుండి పెంన్షన్లు, ఎన్టీఆర్ స్రుజల స్రవంతి, 24 గంటల విద్యుత్ వంటి కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారు. వీటితో పాటు పొలం పిలుస్తోంది, నీరు చెట్టు వంటి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు.

ఆర్దిక లోటుతో కొట్టు మిట్టాడుతున్న చంద్రబాబు ప్రభుత్వం నిదానంగా ఒక్కో కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది. ఇందుకోసం ఇప్పటికే పలు సంక్షేమ పథకాల అమలును ఫైనల్ చేసిన బాబు ఆ మేర తుది మెరుగులు దిద్దుతున్నారు. ముఖ్యంగా ఈ దసరా పండగ నుండి పలు కార్యక్రమాల అమలుకు నోచుకోనున్నాయి. ముఖ్యంగా ఎన్నికల హామీల లో ముఖ్యమైన పెంన్షన్ల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అక్టోబర్ రెండు గాంధీ జయంతి సందర్బంగా ప్రారంభించబోతున్నారు. దీని ద్వారా వ్రుద్దాప్య, వితంతు, వికలాంగల పెన్షన్లు రెండు వందల నుండి 1000 రూపాయలు కాబోతున్నాయి. ఇందుకోసం క్షేత్ర స్దాయిలో పథకం పేదలకు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన చంద్రబాబు, అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకం చేరువ కావాలని మంత్రివర్గ సహచరులకు సూచించారు. ఎలాంటి అవకతవకలు జరగ కుండా పెన్షన్లు అందించాలని బాబు అధికారులను ఆదేశించారు.

ఇక వీటితో పాటు ఎన్టీఆర్ స్రజల స్రవంతి కార్యక్రమాన్నిముఖ్యమంత్రి ప్రారంభించ బోతున్నారు. ఈ పథకం ద్వారా రెండు రూపాలయకు ఇరవై లీటర్ల మినరల్ వాటర్ ను ప్రజలకు అందిచనున్నారు. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు క్రింద అనంతపురం జిల్లాలను ఎంచుకున్న అధికారులు ఈ పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. దీని ద్వారా గ్రామాలకు మినరల్ వాటర్ అందించి ఫ్లోరైడ్ తో పాటు పలు రకాల వ్యాదుల బారి నుంచి ప్రజలను రక్షించాలని ముఖ్యమంత్రి సూచించారు.

అలాగే ఏపిలో ఇరవై నాలుగు గంటల విద్యుత్ కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం నిరంతర విద్యుత్ ను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది. ముఖ్యంతగా సోలార్, విండ్ పవర్ ను అందుబాటులోకి తీసుకు రావడంతో పాటు విశాఖ పట్నం లో ఉన్న ఎన్టీపిసి నుండి అధనంగా నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ తయారికి ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. దీని ద్వారా గ్రామాలతో పాటు, పరిశ్రమలకు ఇరవై నాలుగు గంటల విద్యుత్ ను ఇందుబాటులోకి తీసుకు రావడంతో పాటు వ్యవసాయానికి ఏడు గంటలు నాణ్యమైన విద్యుత్ ను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ విధంగా దసరా పండగకు ప్రభుత్వం ఏపిలో సంక్షేమ కార్యక్రమాలకు తెరతీయబోతుంది.

ఇక వీటితో పాటు నీరు చెట్టు, పొలం పిలుస్తోంది, వంటి కార్యక్రమాల పై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది. అలాగే చంద్రబాబు ఫెవరేట్ కార్యక్రమం జన్మభూమికి కూడా త్వరలో ముఖ్యమంత్రి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ విధంగా పలు సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలకు త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుబ్బరికాయ కొట్టనున్నారు.