రౌడీ రాజకీయమేనా..ఆ 18 ప్రాణాలకు బాద్యులెవరు?

Tuesday, May 15th, 2018, 06:14:52 PM IST

పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మొదలయ్యాయి అంటే అక్కడి పోలీసులకు పని పెరిగినట్టే. ఇక ప్రజలకైతే ప్రాణభయం చుట్టుకున్నట్లే. పంచాయితీ ఎన్నికల్లో అయితే ఎక్కడా లేని మరణ కాండను అక్కడ చూడాల్సి వస్తోంది. సోమవారం జరిగిన ఎన్నికల వలన అక్కడ 18 మంది మృత్యువాత పడటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పట్లో 2003 లో జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా 61 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నికల దృష్ట్యా సరైన భద్రతా ఏర్పాటు చేసినప్పటికీ అక్కడి నాయకుల వ్యవహార శైలి విషమంగా మారేలా చేస్తున్నాయి. ప్రతి ఎన్నికల్లో ఎవరో ఒకరు చనిపోతున్నారు.

అయితే అప్పటికి ఇప్పటికి హింసాకాండ చాలా వరకు తగ్గిందని అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ విమర్శలకు సమాధానం ఇవ్వడం వివాదాస్పదంగా మారుతోంది. ఒక్క ప్రాణం పోయినా దాన్ని వెనక్కి తెప్పించగలరా అంటూ ప్రతిపక్షాలు నిలదీస్తుంటే ఈ విధంగా చావుల లెక్క తగ్గిందని చెప్పడం పార్టీ ప్రతిష్టను దెబ్బ తీస్తోంది. ఎలక్షన్స్ జరగకముందే 34 శాతం పంచాయితీ స్థానాలను ఎలాంటి పోటీని నిర్వహించకుండా తృణమూల్ కాంగ్రెస్ దక్కించుకుంది. ఎవరు మాతో పోటీకి రాలేదని అందుకే అధికారం దక్కించుకున్నాం అనేలా సమాధానం ఇచ్చారు. అయితే రౌడీ రాజకీయం చేసి భయపెట్టి ఆ స్థానాలను అందుకుంద ఇతర పార్టీలు ఆరోపణలు చేశాయి. బీర్భమ్‌ జిల్లాలో ఎలాంటి పోటీ నిర్వహించకుండా ఎక్కువ స్థానాల్లో ఏకగ్రీవకంగా తృణమూల్ పార్టీ అధికారాన్ని అందుకుంది.

  •  
  •  
  •  
  •  

Comments