పాకిస్థాన్ ఫ్యాన్స్ ని ఏప్రిల్ ఫుల్ చేసిన క్రికెటర్!

Monday, April 2nd, 2018, 04:21:27 PM IST

ఈ మధ్య కాలంలో దేశంతో సంబంధం లేకుండా చాలా మంది క్రికెటర్లకు ఫ్యాన్స్ అయిపోతున్నారు. ముఖ్యంగా దేశవాళీ లీగ్స్ వచ్చినప్పటి నుంచి ఇతర దేశాలకు చెందిన ఆటగాళ్లు లోకల్ గా ఫ్యాన్స్ తెగ ఆకట్టుకుంటున్నారు. అయితే ఈ మధ్య వెస్ట్ ఇండీస్ ఆటగాడు డారెన్ సామీ కూడా పాకిస్థాన్ లో చాలా మంది అభిమానులనుకు సంపాదించుకున్నాడు. పాకిస్తాన్ క్రికెట్ లీగ్ లో ఆడిన సామీ పెష్వార్‌జల్మీ జట్టుకు కెప్టెన్ గా ఉండి అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాడు. అయితే పాక్ అభిమానులను డారెన్ సామీ ఏప్రిల్ 1న ఫూల్స్ చేశాడు.

అందుకు సంబందించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డారెన్ సామీ గత కొంత కాలంగా వెస్ట్ ఇండీస్ జట్టుకు దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పాకిస్తాన్ లో వెస్ట్ ఇండీస్ టీ20 సిరీస్ లో పాల్గొంది. అయితే ఆ జట్టులోకి నేను తిరిగి అడుగుపెట్టబోతున్నాను అని సామీ సోషల్ మీడియా ద్వారా చెప్పడంతో హాట్ టాపిక్ అయ్యింది. దీంతో పాక్ అభిమానులు సంబరపడిపోయారు. మళ్లీ సామీ ఆట చూడటానికి రెడీగా ఉన్నట్లు చెప్పడంతో పాటు పాక్ బౌలర్లు నిన్ను అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నారని కామెంట్స్ చేశారు. అయితే వెంటనే సామి ఆ విషయంపై క్షమాపణలు చెబుతూ స్పందించాడు. చాలా మంది నన్ను తిరిగి జట్టులో చూడడానికి ఇష్టపడుతున్నారు. కానీ అందులో నిజం లేదు. క్షమించండి ఏప్రిల్ ఫుల్ అంటూ కామెంట్ పెట్టడంతో పాక్ అభిమానులు షాక్ అయ్యారు.