ఇప్పటివరకు కేంద్రం ఏపీకి ఏమిచ్చిందో చెప్పాలి : కుటుంబ రావు

Friday, June 1st, 2018, 04:00:49 AM IST

కేంద్రంలోని ఎన్డీయే నేతృత్వంలోని బిజెపి ఇప్పటివరకు విభజన సమయంలో, అలానే హోదా విషయంలో ఏ మాత్రం ఏపీకి సాయం చేసిందో చెప్పాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు కుటుంబ రావు డిమాండ్ చేశారు. ఏపీకి కేంద్ర నిధుల విషయమై ఆయన నేడు అమరావతిలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఇప్పటివరకు కేంద్రానికి పంపిన యుసిలపై నీతిఆయోగ్ ఎటువంటి ప్రశ్నలు అడగడం కానీ, ఎటువంటి అభ్యంతరం కానీ చెప్పలేదని, అలాంటిది బిజెపి నేతలు యుసిలో తప్పులు ఉన్నాయని ఎలా చెపుతారని ప్రశ్నించారు. వాస్తవానికి బిజెపి పాలించే రాష్ట్రాలకు మాత్రం నిధులను వరదలాగా పారిస్తున్నారని, అదే బిజెపి యేతర రాష్ట్రాలపై మాత్రం సవతి ప్రేమ చూపిస్తున్నారని అన్నారు.

అసలు విశాఖ చెన్నై కారిడార్ కు కేంద్రం నిధులే ఇవ్వలేదని, ఇప్పటివరకు వారిచ్చిన నిధులను టీడీపీ ప్రభుత్వమే సక్రమంగా వినియోగించకుండా దోచుకుంటున్నారని ఎలా చెప్పగలరని అన్నారు. ఇక కృష్ణ పట్నం పోర్ట్ విషయం పూర్తిగా వదిలేశారని, దానికి కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదని చెప్పారు. ఓవైపు సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి వేల కోట్లు ఇస్తున్న కేంద్రం, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో విభజించబడి, చాలా వరకు నష్టపోయిన ఏపీకి మాత్రం సాయం చేయడానికి కేంద్రం వద్ద నిధులుండవని ఎద్దేవా చేసారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ రూపకల్పనను దుబాయిలో బుర్జ్ ఖలీఫా రూపొందించిన వారికి అప్పగించవచ్చు, అదే ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి నిర్మాణానికి సింగపూర్ సంస్థల డిజైన్లు ఎందుకు తీసుకోకూడదని అన్నారు ……..