ఎటు తేల్చుకోలేకపోతున్న బన్నీ .. ఒత్తిడి పెరిగిందా ?

Saturday, October 6th, 2018, 12:02:26 AM IST


ప్రస్తుతం మెగా ఫాన్స్ ఫోకస్ మొత్తం బన్నీ పైనే ఉంది. అయన నెక్స్ట్ సినిమా విషయంలో ఇంకా ఎటు తేల్చుకోలేకపోతున్నాడు. ఇప్పటికే పలువు దర్శకులతో కథలు విన్నాడు .. అందులో మనం ఫేమ్ విక్రమ్ కుమార్ తో పాటు గీత గోవిందం ఫేమ్ పరశురామ్, క్రేజీ దర్శకుడు మారుతి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కానీ బన్నీ మాత్రం వీరెవరికీ ఓకే చెప్పలేదట. ఎందుకు అయన నెక్స్ట్ సినిమా విషయంలో ఇంత టెన్షన్ పడుతున్నాడు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన నా పేరు సూర్య భారీ పరాజయం పాలవడంతో బన్నీ బాగా హార్ట్ అయ్యాడు. అందుకే నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అందుకే కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే నెక్స్ట్ సినిమా విషయంలో కన్ఫ్యుస్ అవుతున్నాడని, ముక్యంగా ఆయనపై ఫాన్స్ ఒత్తిడి కూడా పెరిగిందని అంటున్నారు. అయితే అల్లు అర్జున్ ఫోకస్ మాత్రం త్రివిక్రమ్ పై ఉంది. అరవింద సమేత షూటింగ్ పూర్తయింది కాబట్టి త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా బన్నీతో చేస్తాడా లేదా అన్నది చూడాలి. ఇక అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి అటు కోలీవుడ్ దర్శకులు లింగుస్వామి, విక్రమ్ కుమార్ లు సిద్ధంగా ఉన్నారు. కానీ వారిని హోల్డ్ లో పెట్టాడు బన్నీ !!