వీడియో : వార్నర్, డికాక్ మధ్య ఏమి జరిగింది ?

Tuesday, March 6th, 2018, 12:15:18 AM IST

ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్, అలానే దక్షిణాఫ్రికా క్రికెటర్ డికాక్ మధ్య జరిగిన మాటల యుద్ధం తీవ్ర పరిణామాలకు తావిస్తోంది. అసలు ఆస్ట్రేలియా జట్టుతో మ్యాచ్‌లు అంటే అభిమానులకు వెంటనే గుర్తుకొచ్చేది స్లెడ్జింగ్‌. మైదానంలో బ్యాట్స్‌మెన్‌ ఏకాగ్రతను మరల్చడానికి మాటల యుద్ధానికి వారు మాటల దిగుతారు. ఇదివరకు వారు ఇటువంటి చర్యలకు పాల్పడినవి మనం చూసాము. అలాగే మైదానం వెలుపల ప్రత్యర్థి జట్టుపై కాస్త దూకుడు ప్రదర్శంచాలని చూస్తారు.

తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ లో భాగంగా జరిగిన తొలి టెస్టు లో నాలుగో రోజు ఆట టీ విరామ సమయంలో డేవిడ్‌ వార్నర్‌, ఆతిథ్య జట్టు వికెట్‌ కీపర్‌ డీకాక్‌పై మాటల యుద్ధానికి దిగాడు. టీ విరామంలో ఇరు జట్ల ఆటగాళ్ల డ్రస్సింగ్‌ రూమ్‌లకు వెళ్లే క్రమంలో ముందుగా ఆసీస్‌ ఆటగాళ్లు మెట్లు ఎక్కుతున్నారు. వారి వెనుక క్రీజులో బ్యాటింగ్‌ చేస్తోన్న డీకాక్‌ వస్తున్నాడు. మెట్లు ఎక్కుతున్న డీకాక్‌పై వార్నర్ తన మాటలతో విరుచుకుపడ్డాడు.

తన సహచర ఆటగాళ్లు వద్దు వద్దు అని వారిస్తున్నా వార్నర్‌ తన ఆవేశాన్ని కొనసాగిస్తూఉన్నాడు. కాసేపటికి కెప్టెన్‌ స్మిత్‌ వచ్చి వార్నర్‌ను డ్రస్సింగ్ రూమ్‌లోకి తీసుకువెళ్లిపోయాడు. కాగా ఈ ఉదంతమంతా మెట్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ వీడియోను స్థానిక మీడియా బయటపెట్టడంతో వైరల్ గ మారి పెను దుమారమే సృష్టిస్తోంది. దీంతో అసలు ఏం జరిగిందో తెలుసుకునే పనిలో క్రికెట్ ఆస్ట్రేలియా నిమగ్నమైంది.

ఈ పూర్తి ఘటన పై విచారణకు ఆదేశించింది. ఒకవేళ విచారణపూర్తి అయితే వార్నర్ దోషిగా తేలే అవకాశం లేకపోలేదని అక్కడి మీడియా చెపుతోంది. ఆదివారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 9 వికెట్ల నష్టానికి 293 పరుగులుచేయగా ,డీకాక్‌, మోర్కెల్‌ లు క్రీజులో ఉన్నారు. ఇంకా 124 పరుగులు చేస్తే సఫారీ జట్టు విజయం సాధిస్తుంది….