చంద్రబాబు కి ఏమైంది – మాటల్లో మార్పునకు కారణం ఏంటో…?

Tuesday, April 16th, 2019, 01:40:24 AM IST

ఏపీలో ఎన్నికలు ముగిసినప్పటినుండి టీడీపీ అధినేత చంద్రబాబు లో చాలా మార్పులు కనిపిస్తున్నాయని పలువురు విశ్లేషకులు అంటున్నారు. పోలింగ్ ముగిసినప్పటినుండి చంద్రబాబు ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతున్నాడు. బహుశా ఓటమి భయంతో చంద్రబాబు మానసిక పరిస్థితి దెబ్బతిన్నదని పలువురు అంటున్నారు. మాట్లాడిన ప్రతిసారీ ముందు చెప్పిన మాటలకూ చాల విరోదంగా మాట్లాడుతున్నాడు. పోలింగ్ ముగిసిన రోజు చంద్రబాబు ప్రెస్ ముందుకు వస్తారని ప్రకటించారు.

మాటతప్పిమరీ మరునాడు ఉదయానికి తమ పార్టీ 120 స్థానాలు గెలుస్తుందని చంద్రబాబు పార్టీ నేతలతో చెప్పినట్టు సమాచారం. కానీ తరవాత చంద్రబాబు 130 స్థానాలు గెలుస్తామన్నట్టు చెప్పారు చంద్రబాబు. కానీ తాజాగా చంద్రబాబు ఇప్పుడు ఏకంగా 150 స్థానాలు గెలుస్తామని అంటున్నారు చంద్రబాబు. ఒకవేళ చంద్రబాబు చెప్పినట్లు టీడీపీ కి 150 పైన రావాలంటే, వైసీపీకి కేవలం 20- 25 స్థానాలు మాత్రమే రావాలి. మరి అలాంటి పరిస్థితి లేదని టీడీపీ నేతలే చెబుతున్నారు. మరి చంద్రబాబు మాటలకూ ఆంతర్యం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు…