రాఖీ కట్టడానికి వచ్చిన చెల్లెలిపై…..?

Tuesday, September 4th, 2018, 02:33:35 AM IST

నేటి కాలంలో మనిషి బుద్ధి రోజురోజుకు మరింత నీచ స్థాయికి దిగజారిపోతోంది. ముఖ్యంగా మన పూర్వీకులు మానవుల మధ్య ఏర్పరచిన పవిత్రమైన సంబంధాలను కొందరు విచక్షణ జ్ఞానం మరిచి విస్మరిస్తున్నారు. వావి, వరుస చూడకుండా తమ కామ వాంఛను తీర్చుకుంటూ పైశాచికంగా ప్రవర్తిస్తూ తమ స్థాయిని దిగజార్చుకుంటున్నారు. రాఖీ పండుగను పురస్కరించుకుని చెల్లెలి వరుస అయిన అమ్మాయి తనకు రాఖీ కట్టడానికి వస్తే, ఆమెపై పైశాచికంగా ప్రవర్తించాడో క్రూరుడు. విషయం ఏమిటంటే, బీహార్ రాష్ట్రంలోని బంద నగరం తింద్వారీకి చెందిన ఒక యువకుడికి ఆరోజున రాఖీ పండుగ అని చెల్లెలు వరుస అయ్యే ఒక యువతీ రాఖీ కట్టడానికి ఇంటికి వచ్చింది. అయితే ఆమెతో రాఖీ కట్టించుకున్న ఆ నీచుడు,

ఆ సమయంలో తన ఇంట్లో ఎవరు లేకపోవడాన్ని గమనించి ఆ అమ్మాయిపై పైశాచికంగా దాడి చేసి, అంతేకాకుండా ఆపై ఆమెను రెండు రోజులపాటు ఒక గదిలో నిర్బంధించి అత్యంత క్రూరంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే రెండురోజుల తరువాత అతగాడి చెర నుండి తప్పించుకుని పారిపోయిన యువతీ, జరిగిన విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు, సదరు యువకుడిని అదుపులోకి తీసుకుని నిర్భయ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. అయితే పవిత్రమైన అన్న చెల్లెళ్ళ సంబంధాన్ని పైశాచిక సంబంధంగా మర్చి ఇంత నీచానికి ఒడిగట్టిన ఆ యువకుడికి కోర్ట్ కఠిన శిక్ష విధించాలని, ఇటువంటి ఘటనలు మళ్ళి ఎక్కడా పునరావృతం కాకుండా చూడాలని స్థానిక మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి…..

  •  
  •  
  •  
  •  

Comments