షాకింగ్ – వైసీపీలో అన్యాయం జరుగుతుంది రోజాకేనా…?

Friday, June 7th, 2019, 12:46:40 AM IST

జగన్ వైసీపీ పార్టీ స్తాపించినప్పటినుండి సినీ నటి రోజా కూడా జగన్ తో పాటే ఆ పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు… అంతేకాకుండా వైసీపీ లో రోజా చాలా కీలకంగా మెలిగిన సంగతి మనకు తెలిసిందే… అయితే గత 2014 ఎన్నికల సమయంలో రోజా నగరి నుంచి విజయం సాధించింది. వైకాపాకు చెందిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి మారినప్పటికీ కూడా రోజా పార్టీ పార్టీని వదలలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా 2019 ఎన్నికల సమయంలో కూడా రోజా నగరి నుంచి మంచి విజయాన్ని సొంతంచేసుకుంది. అయితే ఈ సారి వైసీపీ అదికారంలోకి వచ్చింది. కాగా ఈసారి రోజాకి మంత్రి పదవి ఖాయం అని అందరు కూడా అనుకున్నారు,. అయితే రోజా కి మంత్రి పదవి కాకుండా స్పీకర్ పదవిని కట్టబెట్టాలని వైసీపీ నేతలు సూచిస్తున్నట్లు ప్రచారం జరిగింది. కాగా అది ఇప్పటికి కూడా ప్రచారం లాగే ఉండిపోయింది…

అయితే ఈ స్పీకర్ పదవిని ఉత్తరాంధ్ర వాళ్లకు కేటాయించాలని జగన్ అనుకుంటున్నారని వైసీపీ శ్రేణుల్లో వార్తలు వ్యాపిస్తున్నాయి… ఒకవేళ ఉత్తరాంధ్రకు ఈ స్పీకర్ పదవిని కట్టబెడితే మరి ఇక రోజా పరిస్థితి ఏంటి అనేది తెలియాల్సి ఉంది… అంటే ఇప్పుడు రోజాకు అన్యాయం జరుగుతుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే రోజాకి కొత్తగా డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం. అయితే ఇవన్నీ పుకార్లేనని, అన్ని వివరాలు ఈ నెల 8 న అధికారికంగా తెలుస్తాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి…