కేసీఆర్ మాట్లాడింది ముమ్మాటికీ తప్పే : కిషన్ రెడ్డి

Sunday, March 4th, 2018, 10:34:12 PM IST

ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక సందర్భంలో ప్రధాని మోడీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న వాదన పై ఆయన నిన్న వివరణ ఇవ్వటం జరిగింది. ముందుగా అయన మాట్లాడిన తర్వాత కేంద్ర మంత్రి విమల సీతారామన్ మోడీ ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. తదనంతరం ఆమె వ్యాఖ్యలపై కేసీఆర్ కుమార్తె కవిత స్పందిస్తూ ప్రధానిని ముఖ్యమంత్రి కేసీఆర్ కించపరచలేదని, అసలు ఆయనకు అటువంటి ఉద్దేశం లేదని చెప్పారు.

ఈ అంశం పై కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ తాను ప్రతిదానిని ఉద్దేశించి అన్న మాటల సీడీలు తెప్పించుకొని మరీ చూశానని, అందులో ఎక్కడా ప్రధానిని అగౌరవపరిచింది లేదని తేల్చి చెప్పారు. అయినప్పటికీ వాదిస్తే అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. ఇదిలాఉండగా, తాజాగా తెలంగాణ బీజేపీఎల్పీ నేత కిషన్ రెడ్డి దీనిపై గొంతు విప్పారు. ప్రధాని మోడీపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ఆయన తీవ్రంగా ఖండించటమే కాదు.

తక్షణమే క్షమాపణ చెప్పిల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ సారీ చెప్పే వరకూ విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. కేంద్రం ఇస్తున్న నిధులతో తెలంగాణ సర్కార్ కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రవేశ పెట్టారని, రాష్ట్రంలో ఇప్పటివరకు ఏ మేర అభివృద్ధి జరిగిందనే అంశంపై మాట్లాడటానికి మేము సిద్ధం, ఆయన సిద్ధమైతే బహిరంగ చర్చకు రాగలరా అంటూ సవాలు విసిరారు.

బీజేపీని అంతం చేస్తామని కేసీఆర్ అంటున్న మాటలు వింటే, ఏనుగుని చూసి కుక్కలు మొరుగుతున్న మాదిరిగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌ అవినీతికి మారుపేరుగా మారారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం నుంచి బోధన వరకు చెరుకు రైతుల చర్నాకోల్‌ పేరిట చేపట్టిన పాదయాత్రను ఈ సందర్భంగా ఆయన ప్రారంభించారు….