కత్తి బహిష్కరణపై మంద కృష్ణ స్పందన ఏంటంటే?

Thursday, July 12th, 2018, 03:30:41 AM IST


ఇటీవల శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ పై ఎంతో మంది ప్రముఖులు, రాజకీయ నాయకులూ కూడా మండిపడుతున్న విషయం తెలిసిందే. అయితే కత్తి చేసిన ఈ వ్యాఖ్యలను ఎంతో సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం అతన్ని ఆరు నెలలపాటు హైదరాబాద్ నగరం నుండి వెలివేస్తున్నట్లు ప్రభుత్వం తరపున తెలంగాణ డిజిపి ప్రకటించారు. ఆయన చేసిన ఆ వ్యాఖ్యలు కొందరి మనోభావాలు దెబ్బతీసేవిగా ఉన్నాయని, అందువల్ల ఆయన్ని సిటీ నుండి తన సొంత ఊరు చిత్తూర్ జిల్లాకు పంపించివేస్తున్నట్లు డిజిపి తెలిపారు. కాగా నేడు ఆయన వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ స్పందిస్తూ, ఆయన్ని అలా సంఘం నుండి బహిష్కరించడం అప్రజాస్వామికం అని అన్నారు. వాస్తవానికి కత్తి మహేష్ దళితుడు అయినందువల్లనే అతనిపై బహిష్కరణ వేటువేశారని, డిజిపి ఆయన్ని బహిష్కరించడం చూస్తుంటే అదేదో కుల బహిష్కరణ మాదిరిగా వుందని ఆయన మండిపడ్డారు.

కాగా ఇదివరకు ఈ విధమైన వ్యాఖ్యలు చేసిన అగ్ర వర్ణాలవారిపై మాత్రం ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవు, అసలు శిక్షలు ఎందుకు విధించవు అని ఆయన ప్రశ్నించారు. దీనిపై పలువురు మాట్లాడుతూ, భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇతర మతస్థులను కించపరచడం, వారి మతాలను తక్కువ చేసి మాట్లాడం తప్పని, అటువంటి తప్పులు చేసింది ఎటువంటి వారు అయినప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం వారి పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించక తప్పదని అంటున్నారు. ఐతే ప్రభుత్వాలు, రాజ్యాంగాలు అందరికోసం ఉండాలేకాని, కేవలం కొందరికోసం మాత్రమే అనేలా ఎప్పుడు ఉండకూడదని, ఇది ప్రజాస్వామిక దేశమని ఇక్కడ అందరూ సమానులే అనే విషయాన్నీ ఇకనైనా ప్రభుత్వాలు గుర్తిస్తే బాగుంటుందని వారు అంటున్నారు…

  •  
  •  
  •  
  •  

Comments