సాక్ష్యం’ మూవీ టాక్ ఏంటంటే?

Friday, July 27th, 2018, 12:47:45 PM IST

బెల్లంకొండ సురేష్ పెద్ద కొడుకు అయిన బెల్లంకొండ శ్రీనివాస్, తొలి చిత్రం అల్లుడు శీనుతో మంచి పేరు సంపాదించాడు. అయితే ఆ తరువాత చేసిన స్పీడున్నోడు చిత్రం ప్లాప్ అయింది. ఇక ఆ తరువాత మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో చేసిన జయ జానకి నాయక చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో సాయి శ్రీనివాస్ కి ఆఫర్లు పెరిగాయి. మొదటి నుండి నటన, డాన్స్ ల్లో మంచి పేరు సంపాదించిన సాయి శ్రీనివాస్, ప్రతి చిత్రంతో తన నటనలో పరిణితిని పెంచుకుంటూ వెళ్తున్నాడు అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం అయన లక్ష్యం దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వంలో అయన నటించిన సినిమా సాక్ష్యం. ఇటీవల ట్రైలర్ తోనే మంచి హైప్ సంపాదించిన ఈ సినిమా, నేడు ప్రేక్షకుల ముందుకి రానుంది. ప్రస్తుతం టాలీవుడ్ విశ్లేషకుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సినిమా ఫస్ట్ హాఫ్ మంచి ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, మరియు యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంటుందని,

ముఖ్యంగా ఇంటర్వెల్ లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ బాగా ఆకట్టుకుందని అంటున్నారు. ఇక ఫస్ట్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ సెకండ్ హాఫ్ పై మరింత ఆసక్తిని పెంచుతుందట. ఇక పోతే సెకండ్ హాఫ్ బిగినింగ్ లో ఇంటరెస్టింగ్ గా సాగినా మధ్యలో కొన్ని అనవసరపు సన్నివేశాలతో సాగదీసినట్లు అనిపిస్తుందని అంటున్నారు. ప్రీ క్లైమాక్స్ , ముఖ్యంగా క్లైమాక్స్ చాలా బాగుందని సినిమాకి క్లైమాక్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం వుందని టాక్ వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే సాక్ష్యం చిత్రం యావరేజ్ నుండి ఎబోవ్ యావరేజ్ మధ్య నిలిచే అవకాశం కనపడుతోందని అంటున్నారు. మంచి యాక్షన్ ఎంటెర్టైనెర్స్ ని కోరుకునేవారికి ఈ చిత్రం బాగా నచుతుందట. ఇక ఓవర్ ఆల్ గా ఈ సినిమా ఏ రేంజ్ లో నిలబడుతుందో తెలియాలంటే పూర్తి రివ్యూ వచ్చే వరకు వేచి చూడవలసిందే….

  •  
  •  
  •  
  •  

Comments