మద్యం తాగడానికి డబ్బివ్వలేదని ఆ యువకుడు ఏమిచేసాడంటే!

Sunday, May 20th, 2018, 10:51:06 PM IST

ఇటీవల కాలంలో చెడు అలవాట్లకు బానిసై కొందరు తమ నూరేళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటుంటే మరికొందరేమో ఆ అలవాట్లను వదల్లేక వాటి కోసం డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్యలు చేసుకోవడం అక్కడక్కడా చూస్తున్నాం. అయితే నిన్న ఒక యువకుడు మద్యానికి ఇంట్లో డబ్బులు ఇవ్వలేదని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మడిగె శివరాం అనే యువకుడు మహారాష్ట్ర లోని దెగ్లూర్ నుండి నిజామాబాద్ లోని కోజ కాలనిలో తన అన్న, చెల్లెలు, తల్లితో సహా బ్రతుకు తెరువు నిమిత్తం వలసవచ్చి జీవిస్తున్నాడు. శివరాం, మరియు అతని అన్న రోజువారీ కార్మికులుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే విపరీతంగా మద్యానికి బానిసయిన శివరాం తరచు తన పని డబ్బులను ఇంట్లో ఇవ్వకుండా మద్యం తాగేవాడని అన్న చెపుతున్నాడు.

అయితే మొన్న శుక్రవారం మద్యం తాగేందుకు తన వద్ద డబ్బులు లేకపోవడంతో తల్లి, చెల్లిని అడిగటంతో వారు తమ వద్ద ఏమి లేవు అనడంతో మనస్థాపం చెందిన అతడు స్థానిక మిర్చి కాంపౌండ్ రైల్వే ట్రాక్ పక్కన వున్న ఖాళి స్థలంలోని ఒక చెట్టుకు టవల్ తో ఉరేసుకుని చనిపోయాడు. ఘటన విషయమై స్థానికులు పోలీస్ లకు ఫిర్యాదు చేయడంతో, మృతదేహాన్ని శివరాందిగా గుర్తించిన పోలీస్ లు అతని కుటుంబ సబ్యులకు తెలిపామని చెపుతున్నారు. శివరాం మద్యానికి బానిస అవడం, తరచు డబ్బులకోసం వేధించడం, ఇక మొన్న ఇంట్లో వారు డబ్బులు ఇవ్వకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక ఎస్ఐ గౌరేందర్ తెలిపారు. కాగా శివరాం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు ….

  •  
  •  
  •  
  •  

Comments