బైక్ పై వెళుతున్న జంటపై దుండగుల దాడి……ఏమి జరిగిందంటే ?

Tuesday, May 8th, 2018, 01:30:13 AM IST

ఇటీవల డబ్బుల కోసం కొందరు దుర్మార్గులు ఎంతటి అఘాయిత్యానికైనా పూనుకుంటున్నారు. డబ్బుల కోసం తన, పర అనే తేడాలు లేకుండా కొందరు కర్కశంగా మారి దోపిడీలు, దుర్మార్గాలు చేస్తున్న సంఘటనలు చూస్తున్నాం. కాగా నేడు విజయనగం జిల్లా గరుగుబిల్లి మండలం ఐటిడిఏ పార్క్ వద్ద ఒక హత్య జరిగింది. వివరాల్లోకి వెళితే ఈ మధ్యనే కొత్తగా పెళ్లి అయిన శ్రీకాకుళంజిల్లా, వీరఘట్టం మండలం, కెల్ల గ్రామానికి చెందిన నూతన దంపతులు ఇద్దరు షికారుకు వెళ్లి రాత్రి సమయంలో బైక్ పై తిరిగి వస్తుండగా కొందరు దుండగులు వారిని అడ్డగించి యువతి మెడలో వున్న నగలు అపహరించి పారిపోయేందుకు ప్రయత్నించారు.

అయితే వెంటనే వారిని వారించి, అడ్డగించబోయిన యువతి భర్తను వారు అతి కిరాతకంగా కొట్టి చంపి అక్కడి నుండి పారిపోయారు. ఆ పెనుగులాటలో యువతికి కూడా గాయాలయ్యాయి. కాగా ఘటనపై పోలీస్ లు ఫిర్యాదు చేయగా, అక్కడికి చేరుకున్న పోలీసులు భర్త శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించి, యువతి గాయాలకు చికిత్స చేయిస్తున్నారు. అయితే ఈ దుర్ఘటనకు పాల్పడిన దుండగులను వెంటనే పట్టుకుంటామని, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసు అధికారులు చెపుతున్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments