సడెన్ గా మనిషి అంతరించిపొతే ఈ భూమి ఎలా మారుతుందో తెలుసా..?

Sunday, June 5th, 2016, 11:09:47 AM IST


మనిషి ఈ భూమిపై తెలివైన జంతువులలో ఒకరు. మనిషి తన పరిధిని పెంచుకుంటూపోతున్నాడు. ఆకాశానికి నిచ్చెనలు వేసి వేరే గ్రహాలపై కాలు నిపుతున్నాడు. అయితే.. ఒకవేళ మనిషి సడెన్ గా ఉన్నట్టుండి అంతరించిపొతే.. ఈ భూగ్రహం ఎలా మారుతుంది.. ఇప్పుడున్న కట్టడాలు, అధునాతన టెక్నాలజీ అంతా ఏమౌతుంది.. భూమిని 600 సార్లు కాల్చివేయగల అణ్వాయుదాలున్న ప్రపంచం ఎలా తయారవుతుంది. ఇప్పుడు చూద్దాం.

మనిషి సడెన్ గా అంతరించిపొతే.. భూమిపై ఉన్న కట్టడాలన్ని కూడా తుప్పుపట్టిపోవడానికి కనీసం 100 సంవత్సరాలు పడుతుందట. ఇక అవన్నీ కూలిపోయి, రూపుమారిపోవడానికి కట్టడాలపు మొక్కలు, మొలవడానికి కనీసం పదివేల సంవత్సరాలు పడుతుందట. అంతేకాదు, భూమిపై ఉన్న మనిషి ఆనవాళ్ళు మొత్తం పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడానికి పదివేల సంవత్సరాలు పడుతుందని అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నది. దీనిని చూస్తుంటే మనిషి ఇప్పటి నుంచి జాగ్రత్తపడక తప్పదు.

వీడియో కోసం క్లిక్ చేయండి: