ఫెస్ బుక్ కి గుడ్ బాయ్ చెప్పేసిన వాట్సాప్ సిఈఓ

Tuesday, May 1st, 2018, 01:46:08 PM IST

ఎప్పుడు లేని విధంగా సోషల్ మీడియా దిగ్గజం ఫెస్ బుక్ వివాదాల్లో చిక్కుకుంటోంది. చేసిన పొరపాట్లకు గాను ప్రపంచ ముందు దోషిగా నిలబడుతోంది. ఇటీవల ఫెస్ బుక్ నుంచి వ్యక్తిగత సమాచార దుర్వినియోగం అవుతోందని అనేక ఆరోపణలు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఆ వివాదం కారణంగా ఇప్పుడు కంపెనీకి తెలియకుండానే దెబ్బ పడుతోంది. ఫెస్ బుక్ మాతృక సంస్థ అయినా వాట్సాప్ సిఈఓ డైరెక్టర్‌ బోర్డు నుంచి తప్పుకున్నట్లు తెలిపాడు.

వాట్సాప్ సిఈఓ గానే కాకుండా ఫెస్ బుక్ డైరెక్టర్ విభాగంలో కొనసాగుతోన్న జాన్‌ కౌమ్‌ ఏ కారణం చెప్పకుండా ఫెస్ బుక్ సంస్థ నుంచి పూర్తిగా సంబంధాలను తెంపుకున్నాడు. తన ఫెస్ బుక్ ఖాతాలో సోమవారం రాజీనామా చేస్తున్నట్లు జాన్‌ కౌమ్‌ వివరించాడు. అయితే జాన్‌ కౌమ్‌ ఎందుకు ఇలా చేశాడో ఇంతవరకు ఫెస్ బుక్ సంస్థ కూడా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దీంతో సోషల్ మీడియాలో అనేక అనుమానాలు మొదలవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే ఫెస్ బుక్ చేసిన పొరపాట్లకు క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. కానీ ఆ తరువాత కూడా సంస్థలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం అందరిని ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.