వాట్సాప్ సంచలన నిర్ణయం: ఇండియాలో సేవలు బంద్..?

Monday, February 11th, 2019, 04:12:54 PM IST


అదేంటీ ఇండియాలో వాట్సాప్ బ్యాన్ అవ్వటం ఏంటని అనుకుంటున్నారా? వాస్తవానికి బ్యాన్ అవ్వట్లేదు కానీ, కొన్ని కఠినమైన ఆంక్షలు విధించనుంది. పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో భారత ప్రభుత్వం సోషల్ మీడియా సంస్థలకు కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది. వాటికి సహకరించి ఎన్నికల వేల దేశంలో ఎలాంటి అసాంఘిక చర్యలు జరగకుండా చూడటంలో తోడ్పడాలని కోరింది.ఈ క్రమంలో ఇప్పటివరకు వాట్సాప్ లో ఉన్న “ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షెన్” సెక్యూరిటీ పాలసీలో కొన్ని మార్పులు చోటు చేసుకోనున్నాయి. వాట్సాప్ లో ఉన్న ఈ ఫీచర్ ద్వారా మనం పంపుతున్న మెసేజ్ లు సెండర్, రిసీవర్ తప్ప మూడో వ్యక్తికీ తెలిసే అవకాశం లేదు, ఆ మాటకొస్తే వాట్సాప్ సంస్థకు కూడా ప్రత్యేక అనుమతి లేనిదే వినియోగదారులు పంపే మెసేజ్ లు చూసే అవకాశం లేదు. ఇపుడు భారత ప్రభుత్వం కోరిక మేరకు వాట్సాప్ లో కొత్త మార్పులు తెచ్చే దిశగా చర్చలు జరుపుతోంది యాజమాన్యం.

వాట్సాప్ కు భారత దేశంలో సుమారు 200బిలియన్ల వినియోగదారులు ఉన్నారు, ఒక రకంగా చెప్పాలంటే ఇండియాలో మెసేజింగ్ యాప్ అంటే ఠక్కున గుర్తొచ్చేది వాట్సాప్ అనేంతలా వ్యాపించింది. అయితే వాట్సాప్ లో ఉన్న సెక్యూరిటీ ఫీచర్స్ వల్ల కొన్ని కేసుల్లో అనుమానాలు నివృత్తి అవటం కష్టం అవుతుంది. ఈ ఇబ్బంది నుండి బయటపడటానికి భారత ప్రభుత్వం వాట్సాప్ సంస్థ ముందు కొన్ని ప్రతిపాదనలు ఉంచింది, వాటిని అమలు చేయటంలో సాధ్యాసాధ్యాల గురించి చర్చలు జరుగుతున్నట్లు వాట్సాప్ అధినేత కార్ల్ వూగ్ తెలిపారు. ప్రతి నెలా 2మిలియన్ల మేర అనుమానాస్పద అకౌంట్లను బ్లాక్ చేస్తున్నామని వాటిలో 20శాతం మేర రిజిస్ట్రేషన్ సమయంలోనే బ్లాక్ చేస్తున్నామని, 70శాతం వరకు అనుమానాస్పద అకౌంట్లను బినియోగదారుల ఫిర్యాదు అందకముందే బ్లాక్ చేస్తున్నామని వూగ్ తెలిపారు. ఈ కసరత్తంతా కూడా ఎలక్షన్ లాంటి కీలక సమయాల్లో భద్రతను కట్టుదిట్టం చేసేందుకే చేస్తామని అన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ డిమాండ్ మేరకు వాట్సాప్ సంస్థ అదనంగా కొంత మంది ఉద్యోగుల నియామకం చేపట్టనున్నట్టు తెలిపారు, అంతే కాకుండా వాట్సాప్ ద్వారా అసాంఘిక చర్యలను నియంత్రించేందుకు ఒక గ్రీవెన్స్ ఆఫీసర్ నియామకం కూడా చేపట్టనున్నట్టు తెలిపారు.